పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

203 దేవత్వము

"క్రైస్తవులగు మీరు హింసాపరులై సంతతమూ మమ్ము పీడించుచున్నారు; ప్రస్తుత మొక్కసారి మీయెడ మేము కౄరత వహించేటప్పటికి మీకు ఆశ్చర్యమూ దిగులూ పుట్టినవా ? మే మెన్నో ఏళ్ళనుంచి సైరిస్తూన్న దానిని మీ రొకనాడు సహింపలేరా ? నేటికి పన్నెం డేళ్ళనుంచి ఎంటోనియో మా షైలాకును గహిన్‌ంచుచుండెనే! ఇంతకాలమూ అతనిని తిట్టడము చాలక నేడుకూడా మానడాయె మమ్మేవగించి కనబడినచోటులనెల్ల అవమానించక మానరు. ఈనాటికి మీచేయి క్రిందయినదని దయాసరణిగురించి శ్రీరంగనీతు లాడజొచ్చినారు! పోనీ, ఇట్టిదయ మీరెన్నడైన మాయెడ చూపినారా? మీదయాపరత్వము మే మెరుగమా ? అట్టి మీపై మాకు జాలిపుట్టునా ? చాల్చాలు! మీమాటలు విన్న నెవ్వరైన నవ్విపోదురు" అని యూదులు ఎత్తిపొడువ జాలరా ?

షైలా కంత పట్టుబట్టడానికి హేతు వేమి ? అతని కంత అసహన మెందుకు పుట్టింది ? అదంతా క్రైస్తవులు యూదులయెడ కన్పర్చిన ధిక్కారము, బాధలయొక్కయూ పర్యవసానము. కవి మాత్రము వారియెడల గన్పరచిన కరుణ యెట్టిది ? దావాతీర్పును బట్టి ఎంటోనియో శిక్షింపబడలేదు సరేకదా షైలాకుప్రాణముమీదికి వచ్చింది. తగవంతా తబ్బిబైనది. న్యాయాధికారి దయతలచి షైలాకుప్రాణము నిల్పెనుగాని, జీవనాధారము, గౌరవదాయకము నైన అతని