పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

201 దేవత్వము

లందరూ (విశేషించి బ్రాహ్మణులు) ఈ పదిగుణములూ కలిగి యుండేవారు. ఇప్పటికీ నవనాగరికత చొరకున్న హిందూ గృహములందు కుటుంబసమష్టికి క్షమయే మూలబలముగా నున్నది - యూరోపీయ సంఘముల శిక్షాప్రణాళి, సంఘనిర్మాణమూ స్వతంత్రము లగుటపట్ల క్షాంతి కందు చోటులేదు. వారి నీతిశాస్త్రానుసారము శమము క్షాంతీ అలౌకికధర్మములు గా గణింపబడినవి చూడండి - 178 పేజి -

                  To err is human, to forgive is divine
                  తప్పుచేయుట మానవధర్మ మగును, క్షాంతి ధర్మంబు స్వర్గవాస్తవ్యులకును.

మనము శాంతిని క్షాంతిని మానవధర్మములుగా గణింప వారవి దేవతాధర్మములందురు. వారిమతప్రవర్తకుడు ఏసుక్రీస్తు అవసానకాలమున - "తండ్రీ, నా హంతకుల క్షమింపుము, వారనేది వారే ఎరుగర"ని సర్వేశ్వరుని ప్రార్థించెను.

ఐరోపీయసాహిత్యమున క్షమాగుణభూషితుల చరితము లత్యంతదుర్లభములు - పోర్షియా ఇసబెలాలు క్షమాగుణ దివ్యశోభను హృద్యముగా కీర్తింతురు, ఇది వినువారలను క్షణకాలము వెరగుపడ జేయునేకాని వారిమానసములందు నెలకొనదు - ఇట్లు కావలెనంటే ఆగుణమును మానవచరితములందు చేర్చి కల్పన చేయవలెను. ధనలుబ్ధుడగు షైలాకు చరితమున తరువుకానితనము, నిర్దయ, మాటపట్టుదలయు, ఏంజిలో చరితమున దండనీతికఠోరనియమ పాలనమున్నూ కూర్ఛినట్లే, క్షమాగుణము నేపాత్రమునందైనా షేక్స్‌పియరు