పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200 సాహిత్య మీమాంస

సరేకదా లక్ష్మణుడు కోపోద్రేకమున నామెను నిందింప జొచ్చిన ఆతని మందలించెను. క్షాంతిచేత ఆతని చిత్తమునకెట్టి శాంతి చేకూరెనో, అది యెంత స్థిరమైయుండెనో కొంచెము భావించండి.

ధర్మరాజునందు కూడా ఇట్టి క్షాంతే కానవచ్చును. పుత్రప్రేమచేత వివేకదూరుడై తండ్రిలేని పాండవులయెడ ధృతరాష్ట్రు డొనర్చిన దుండగముల గూర్చి ధర్మజుడు పెదవి కదల్ప లేదు, ఆతనియెడ ననాదరము గానీ ఔదాసీన్యముకానీ చూపలేదు; అతని ఆగడములు సైరించుటే కాక అతనిని దైవమువలె నారాధించు చుండెను. భీష్ముడు ధీరోత్తముడు, సత్యవాది, దానశీలుడు, క్షాంతిపరుడు. శ్రీకృష్ణుడు శిశుపాలు నెడ చూపిన క్షాంతి అందరూ ఎరిగినదే. ఆర్యులలో పురుషులు మాత్రమేకాక స్త్రీలుకూడా క్షమాసంపన్నలే, పుత్రశోకోప హతమానసయైన ద్రౌపది అశ్వత్థామయెడ నెంత క్షాంతి వహించెనో వినియున్నారు. సౌదానుడనురాజు వశిష్ఠునిపై కనలి శపింప నుద్యుక్తు డగునప్పుడు ఆతనిసతి వారించెనని రామాయాణమున నున్నది.

హిందూసంఘమున క్షమ సర్వసాధారణధర్మము కాని అలౌకికము కాదు. మానవధర్మము లలో నిది ప్రధానము ఆధర్మమున కంగములు పది : _ ధృతి, క్షమ, దమము, అస్తేయము, శౌచము, శమము, బుద్ధి, విద్య, సత్యము, అక్రోధము - అని మానవధర్మశాస్తమం దున్నది. పూర్వమున ఆర్యు