పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

199 దేవత్వము

చేరరు, అట్టివారిని ప్రేమచేత వశులను చేసుకొను టెట్లు తన్నాదరించనివారిని తా నాదరించుట సంభవ మగునా? ఆదరించనివారియెడ ప్రేమజూపుటకు వీలేది? ఆదరముంటేనేకదా ప్రేయసుల దోషములు లెక్కకు రావు. ప్రేమ, శ్రద్ధ, దయ, భక్తి, ఇవి నరుని పక్షపాతిగా నొనర్చును. బందుగులయెడ నెట్లో భగవంతునియెడ నట్లే, హిందూకుటుంబమువంటి క్షమారాజ్య మింకొకచోట నుండబోదు. క్షమ మానవునకు సుభాషణము. *[1]

శ్రీరామునియందలి క్షాంతి చూడండి - కైకేయి ఆతని నెంత బాధించినది ! వనవాసము తెచ్చి పెట్టడమే కాక తండ్రిని కూడా చంపింది - శ్రీరాముని వియోగము ప్రాప్తించి నప్పటినుంచీ పాప మాదశరథుడు విషాదసాగరమునబడి మరి తరింపనేలేక మృత్యువువాత పడినాడు. దీని కంతటికీ హేతు వామెయే కదా ! క్షమాశీలుడగు శ్రీరాముడు దాని నెంత మాత్రము సరకుచేయలేదు, ఆమెను పల్లెత్తుమాటాడలేదు,

                        Not the king's crown, nor the deputed sword,
                        The marshal's truncheon, nor the Judge's robe,
                        Become them with one half so good a grace
                        As mercy does....................................Shak.

                        కాదునృపాలమౌళియును, కాదధికారికిగల్గు కత్తియున్,
                        కాదుచమూనియంతృగద, కాదుసభాపతిమేని అంగియున్.
                        కాదరవీసమైన దయకైవడి శ్రేష్ఠవిభూషణంబు.
                        ...........................................................
                                                               ఆ|| నా|| దా||