పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152 సాహిత్య మీమాంస

కుండలేదు. ఆ వీరులచరిత్రము మాత్రమే పఠించుటవల్ల విష ఫలము ప్రాప్తించితీరును. పాపచరితములనే పఠించుటచేత కల్పనాశక్తి పంకిలమగును; అందుచే వీటికి ప్రతిగా వేరొకజాతి వీరుల చిత్రించిరి. ఆధర్మవీరులు తమ ఉజ్వలాలోకమహిమచే పశువీరుల అంధకారమున అణగద్రొక్కి, వారే చదువరుల కల్పనాశక్తి నాకర్షించి, దానిని ధర్మస్యూతముగా నొనరింతురు. ఈ వీరులే మన కావ్యములందు ఇతిహాసములందును నుతిగన్నవారు. రావణదుర్యోధనుల చరితములు మాత్రమే చదివినవారికి ఐరోపీయవీరుల చరితములు చదివిన ఫలమే చేకూరును, కాని భారతరామాయణములు సాంతముగా చదివిన వారి కల్పనాశక్తి దోషసంకలితము కానేరదు.

పాశ్చాత్యసాహిత్యమున షార్ల మేన్, సికిందర్, సీజర్, నెపోలియన్, ఫ్రెడెరిక్, ఐదవచార్లెస్, తైమూర్ మొదలగు వారు దిగ్విజయములు చేసి ఘనత కెక్కిన మహావీరులు. ఆర్య సాహిత్యమందున్నూ ఇట్టివారు లేకపోలేదు - రఘువు, శ్రీరాముడు, పాండురాజు, అర్జునుడు, కర్ణుడు మొదలగువారుకూడా దిగ్విజయ మొనర్చినారు, కాని యీ రెండు తెగలవారియందు తేడా యున్నది. రఘుమహారాజు విశ్వజిద్యాగమునకును శ్రీరాము డశ్వమేధముకోసము, పాండవులూ కర్ణుడున్నూ రాజసూయముకొరకున్నూ దిగ్విజయ మొనర్ప, ఐరోపీయులు లోభమునకు వశులై సర్వమూ కబళించుటకు రక్తప్రవాహములు కల్పించిరి. దిగ్విజయమువల్ల ఆర్జించిన ధనము నార్యులు