పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

147 వీరత్వము

శ్రీరాముని చిత్రించుటగాంచి అతని నతిక్రమింపనెంచి వ్యాసుడు కృష్ణలీలల కల్పించెను. పిమ్మట శ్రీరాముని గౌరవోన్నతి నిలువబెట్టదలచి కాళిదాసు రఘువంశము నంతయు వర్ణించెను. ఇందలి చిత్రము లతివిచిత్రములు, రచనా నైపుణియు అనన్యసామాన్యము. మొదట దిలీపుని చరితము, పిమ్మట దానిని క్రిందుసేయు రఘుమహారాజు చరిత్ర వర్ణించి, కులగౌరవమును పెద్దచేసి కులముకంతటికీ కీర్తితెచ్చుటకు అతని పేర నావంశము బరగజేసెను. ఇంతతో నాగక కుల పురుషులందరిలో ఘనుడై గౌరవనీయుడైన శ్రీరాముని చరిత్ర వర్ణించెను. అప్పటికి రాఘవుడన్న శ్రీరాముడే అని రూఢిఅయ్యెను. ఒక్క రఘుకులమునకేకాక సూర్యవంశమునకే తిలకాయమానుడగు శ్రీరామచంద్రునిముందు తక్కిన రాజు లెల్ల తారలైరి; కులగౌరవమున కాతడు ఉనికిపట్టాయెను.

పృథ్వియం దేరాజవంశమూ ధారావాహికాక్రమమున ఇట్టి ఉత్తరోత్తరోత్కర్షలాభము గనుట వినలేదు చూడలేదు. దిలీపుడు, రఘువు, అజుడు, దశరథుడు, శ్రీరాముడు నొకరితరువాత నొక రయోధ్య నేలినారు. శ్రీరామునితో నావంశము పరమావధిని చేరింది. తరువాత కుశుశు, అతిథి, సుదర్శనుడు మొదలగు రాజులందరూ దివిటీముందర దీపాలై శ్రీరాముని ఉత్కర్షనే ప్రతిపాదించిరి. అతనికి సముడే లేనప్పుడు అతని మించిన వారెట్లుందురు? స్కాట్లెండ్ ఇంగ్లెండుల సీమాంత (Border) ప్రదేశీయులగు రాజుల రక్త