పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146 సాహిత్య మీమాంస

ముగా నావిల్లు నెక్కిడి తన అమానుషవిక్రమమును యశో విస్తారమును భరతఖండ మంతటా ప్రకటించెను. ఇంతతోసహా సంతుష్టి చెందక దీనికన్న కఠినతరకార్యమునకు శ్రీరాముడు పూనుకొనవలసివచ్చెను. వివాహానంతరమున "అయోధ్యకు పోవు దారిలో నృపవైరియైన పరశురాముడు కారుమొయిలు కరణి చాపధరుడై, కాలమృత్యువో యన" నరికట్టెను.ఇరువైయొకసారి పుడమిని క్షత్రశూన్యముజేసిన మహావీరుడు, నిరుపమానవీరత్వసంపదచే గ్రాలు కార్తవీర్యుని పీచమడచిన భీమబాహాబలుడు, రాజనువానినెల్ల రాసి విడిచిన ఆప్రతిమ ప్రతాపవంతుడు కయ్యానికి కాలుదువ్వి హరధనువును మించిన హరిధనుస్సు నొకదాని "నెక్కిడుము లేకున్న చంపెద" నని శ్రీరామున కందించెను. అనర్ఘ రాఘవు డాధనువు నవలీల నెక్కుపెట్టి పరశురాముని మించిన వీరుడని ప్రకటించిన తోడనే "భండనప్రచండపండితుండ" వని పరశురాముడు మెచ్చుకొనెను;* [1]తనయుని అద్భుతశౌర్యమునకు లోలోన తనిసి దశరథుడు ప్రపుల్ల చిత్తమున తనపట్టణమును చేరెను.

బాల్యమున నిట్టి నిస్తులవీరత్వసంపద గూర్చి వాల్మీకి

  1. *

                 నావిల్లెక్కిడినప్పుడ, నీవు చతుర్భుజుడవౌట నిక్కము, మదిలో
                 భావించి కంటి, నితరుల కీవిక్రమబాహుశక్తు లెందును గలవే?
                 ఉల్లమున లజ్జదోపదు, ముల్లోకములేలు దేవముఖ్యునిచే నే
                 నిల్లీల భంగపడ, నుద్యల్లలిత కృపాభిరామ దశరథరామా.
                                                             ......రామాయణము.