పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

145 వీరత్వము

తపస్సు, విద్య, వివేకమున్నూ వర్ణించి చూపెను. అయోధ్య యందలి అప్పటి సుఖము, సంపద, సౌందర్యమునూ గాంచి చకితుల మగుదుము, అతనికి సముడు మరొకరాజు లే డనిపించును. కాని అనంతరము ఆతనికన్న నుజ్జ్వలతరమగు నక్షత్ర మారాజకులాకాశమున పొడుచును, తత్ప్రభావమును విశ్వామిత్రు డందరికీ ఎరిగించును. రఘుకులమం దుదయించిన ఆ వీరశిఖామణి "కూకటిముడికినై కురులు కూడని నాడె" ఋష్యాశ్రమములందలి రాక్షసపీడయు తపోవిఘ్నములు నంతరింపచేయగలడని ఆ ముని జ్ఞానదృష్టిచే గాంచగల్గెను, కనుకనే నిండోలగమున తనవెంట శ్రీరాముని పంపుమని దశరథుని ప్రార్థించునప్పుడు శ్రీరాముని ప్రభావము విదితమై మన కాతనియెడ గౌరవము పుట్టును; ఆ దివ్యనక్షత్రప్రభ అప్పుడు మనకళ్ళకు గట్టును. ఈలాగే పరమభాగవతుడగు నారదముని మూలాన శ్రీకృష్ణప్రభావము లోకమునకు విదితమగును.

వీర కార్యనిర్వహణముకోసము విశ్వామిత్రుడు శ్రీరాముని కొనిపోయినపిమ్మట అత డాకఠినకర్మయందు కనపరచిన వీర్యశౌర్యములు వాల్మీకి చక్కగా వర్ణించెను. అంతతో నాగక అంతకన్న వీరత్వనికషపాషాణమగు వేరొకచోటి కారాణ్ముని కోదండపాణిని గొంపోయెను. మిథిలలో సీతా స్వయంవరసభకు వీరాధివీరు లెందరో పోయి శివధనువు నెక్కుపెట్టలేకపోగా శ్రీరాము డాపనికి బూని అనాయాస