పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరో ప్రకరణము.

______

సాహిత్యమున వీరత్వము.

వీరుల ఆదర్శము

ఆర్యకవికులగురువగు వాల్మీకి సీతపాత్రమున సతీత్వ పరమావధి నిరూపించినట్లు శ్రీరామపాత్రమున వీరత్వపరమావధి నిరూపించెను. ఆర్యలలనాసౌందర్యము, ప్రేమ, భక్తి, దేవత్వమూ సీతయం దగుపడును; ఆర్యపౌరుషము, గౌరవము, వీరత్వము, రాజవైభవదివ్యతేజమున్నూ శ్రీరాముని యందు గాంచనగును. కులమునకూ జాతికీ గౌరవము తేవడమే ఆర్యుని ముఖ్యకర్తవ్యము, శ్రీరామునియం దిదే కనబడును. ఆతడు రఘుకులతిలకుడు, క్షత్రియశేఖరుడు. అట్టి గౌరవ మగపరచుటకే వాల్మీకి మొదట దశరథుని పాత్రమును చిత్రించి అందు సౌర్యము, రాజ్యశాసనచాతురి, ప్రభుత్వము, యశము, మంత్రణ, కార్యకౌశలము, సంపద, సహృదయత, దుర్గసంపత్తి, చతురంగబలము, ధర్మపరాయణత,