పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142 సాహిత్య మీమాంస

ఆదర్శములకు ఏకత్ర సమావేశ మెన్నటికీ సరిపడదు. మన ఆదర్శములను మాని వారి యాదర్శముల నవలంబిస్తే కొత్త భావములు మనహృదయములందు నాటి కాలక్రమమున స్వదేశగౌరవము సన్నగిల్లును. పవిత్రము సుప్రతిష్ఠితము నగు మనసంఘమును దోషసంకులమగు విదేశాచార సంసర్గమున పంకిలము చేయరాదు. దేవత్వమానుషత్వముల వీడి పశుత్వమున పడగోరు వీరిడి యుండునా?

మనయాచారములలో లోపములున్న కాలానుసారముగా వాటిని దిద్దుకోవలయు గాని సరికొత్త పుంతలలో జన కూడునా? ఇట్టి యాపద లక్కడక్కడ పొడచూపుచున్న వే, అవి తొలగుటెట్లు? విదేశసాహిత్యపఠనము మనకు తప్పనిసరి యైనది; పొట్టపోసుకొనుటకే కాదు, అది చదువుకున్న చాలా విషయములకు మనము వెలియగుదుము. కావున తత్పఠన మొనర్చుచూ అందలి నీచభావములు మనహృదయములందు కుదురుకొనకుండా జాగరూకతతో గమనించవలెను. విదేశ సాహిత్యముతో బాటు మనసాహిత్యముకూడా పఠించడమే ఆ విషమునకు విరుగుడు. రెండోది మన కుటుంబాచారములను విదేశదురాచారపన్నగము కరవకుండునట్లు నడపవలెను. అనాదినుండీ ఏ సాహిత్యపఠనమున మనసంఘమునకు సద్గుణము లలవడి అది వీఇతము సుశిక్షితము నయ్యెనో, అట్టి సాహిత్యమునకు విముఖులము కాకుంటే మనకు తప్పక శుభము చేకూరును. అందలి సాధుత్వము, పవిత్రత, సంయ