పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

141 మానవప్రేమ

అభిప్రాయ మోలాగూ ఉంటే ఉపద్రవము వచ్చితీరును. వివాహబంధమున తారుమారులులేక పతిపత్నీ సంబంధము జీవావధియై, భక్తి ప్రేమసూన్యతమై, సతీత్వలీలాక్షేత్రమైన ఆర్యసంఘమున సరళత, ప్రేమ, కోమలత, లజ్జ, దయ, ఓరిమి మొదలగు గుణములు స్త్రీజనమున కలంకారములుగ నున్నవి కావున పతిపత్నీసమత ప్రబలిందా ఆచారవిప్లవము తప్పక సంభవించును. మనసంఘమున ఎచ్చుతగ్గులూ, ఆత్మనిగ్రహమూ (స్వాధీనత) ఉండవలెను. పాశ్చాత్యసంఘములందున్నది స్వేచ్ఛాచరణము.

ఆర్యసాహిత్యసమాలోచ నావశ్యకత

ప్రాచీనప్రతిష్ఠితములు, భక్తిప్రేమపూరితములు నగు మన సంఘరీతు లంతరించి పాశ్చాత్యసంఘమర్యాద మనదేశమున ప్రతిష్ఠితము కావలెనని కోరువారుందురా? ఈరెండింటి ఘటనాప్రణాళులు విపరీతములనీ, తత్ప్రేమాదర్శములు విషమములనీ ఉదాహరణలతో నిదివరలో వివరించియుంటిమి. ఆర్యప్రేమాదర్శమున భక్తిశ్రద్ధాది ఉత్కృష్టప్రవృత్తుల ఉత్తేజనము, స్పూర్తి, ధర్మనీతిప్రాబల్యము నున్నవి, పాశ్చాత్యాదర్శమున షడ్రిపుప్రాధాన్య ముంది; రిపుషట్కము అస్థిరమగు నింద్రియసుఖానుకూలము. మన ఆదర్శమున ధర్మ నీతిశాసనాధీనత యుంది, వారి యాదర్శమున స్వార్థపరత్వము పతిపత్నీ సమతా యున్నవి. ఇందు యథార్థమైన స్వాధీనత, అందు స్వేచ్ఛావృత్తియు నున్నవి. ఇట్టివైషమ్యము గల