పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140 సాహిత్య మీమాంస

విదేశీయప్రేమయందలి పతిపత్నీ సామ్యభావము

హిందూసంఘములయందును, కుటుంబముల యందున్నూ దృఢబంధమై గానవచ్చెడు భక్తి అను అపూర్వ పదార్థము విదేశీయసంఘములందు లేనందున తత్సాహిత్యమునందు కూడా అది మృగ్య మగుచున్నది. వారి దాంపత్యమునం దెచ్చుతగ్గులూ, ఒక రొకరియధీనమున నుండుటయూ లేవు. ఆప్రేమ అంతా వినిమయము - ఇచ్చి పుచ్చుకొనుట. "నీవు నన్ను ప్రేమించితివా నేను నిన్ను ప్రేమించెదను. అట్లుకాదేని నీవు వేరు, నేను వేరు; నీదారి నీది, నాదారి నాది." ఇది వారి దాంపత్యసరణి! పతిపత్నీ త్యాగము, స్త్రీలకు బహువివాహములు, యౌవనమున స్వేచ్ఛాచరణమును వారికి సదాచారములు కావున స్వచ్ఛందవృత్తి, పతిపత్నీసమత్వము వారియందు ప్రబలమై యుండును. ఆ సాహిత్యమందున్నూ ఆరెండుధర్మములే ద్యోతకము లగుటచేత దానినే సదా పఠించువారి మానసములందు స్త్రీలు పురుషులకు లొంగి తిరుగ నేల? పురుషులకంటె వారి తక్కువ ఏమి? ఇది అన్యాయము, పతిపత్నీ సామ్యభావము న్యాయము, అను రూఢాభిప్రాయము కలుగును. ఇట్టి భావములు మన సాహిత్యమునా ఇప్పుడిప్పు డవతరిస్తూన్నవి, నవనాగరికు లీ నూతనాదర్శములను పొగడుచున్నారు. మన సంఘనియమము లనుకరించు మన సాహిత్యమున ఈభావమునకు చోటులేదు, ఒకవేళ మనము చేర్చినా అది తక్కినవాటిలో యిముడదు; ఆచరణ మోలాగు