పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

139 మానవప్రేమ

ములచేత వారు భూషిత లగుదురు. *[1] మన సాంఘిక వ్యవస్థలకూ, శిక్షకూ, బాల్యవివాహములకూ పరిణామ మిది ఈ వ్యవస్థలను తారుమారు చేస్తే ఫలము వికటించును, కావున ఈ యాచారమునకు భంగము వాటిల్లకుండా మనము పాటుపడ వలయును. **[2]

  1. * పడతులు అత్తింట నేర్చుకొనదగు నంశముల నన్నిటిని కాళిదాసు కణ్వమహర్షిచే నిట్లుచెప్పించెను -

                   శుశ్రూషస్వ గురూన్ కురు ప్రియసఖీవృత్తిం సపత్నీ జనే
                   భర్తుర్విప్రకృతాపి రోషణతయా మాస్మ ప్రతీపంగమ:
                   భూయిష్ఠం భవ దక్షిణాపరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
                   యాంత్యేవం గృహిణీపదం యువతయో వామా:కులస్యాధయ:||

                   పనివిని కొల్వు పెద్దల; సపత్నులచోట ప్రియాళివృత్తిగై
                   కొను; పతియల్గ నల్గి ప్రతికూలవుగాకుము; భోగభాగ్యముల్
                   గనుగొని పొంగబోకు, దయకల్గుము సేవకులందు, నాతి గాం
                   చును గృహిణీపదం బిటులు; చూడగ లాతి కులాధియే సుమీ.

  2. ** ఈ యభిప్రాయము సమంజసమని నాకు తోచదు. బాల్యవివాహమున గుణమున్నది, దోషము లున్నవి; దోషములే ఎక్కువని చెప్పవచ్చును. వాటిని రూపుమాపకుంటే బాల్యవివాహము దురాచారమనే నాతలంపు. దోషము లందరికీ స్పష్టమగుటచేత ఇక్కడ విస్తరింపలేదు. ప్రౌఢవివాహము లాచరణములోనికి వచ్చేదాకా యువకులచెవులను బాల్యవివాహదూషణము సోకనీయరాదు. మొదటనుండీ సత్సహవాసము, నైతికశిక్ష, సద్గ్రంథపఠనము మొదలగు పరిస్థితులను సమకూర్చుట యుక్తము. యువకులు బ్రహ్మచర్యము పాలింపలేక, అభిభావుకు లందుకు తగిన ఏర్పాటులను చేయనేరనిచో బాల్యవివాహము లొనర్చుటయే మేలు