పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122 సాహిత్య మీమాంస

దర్శనీయము. ఇట్టి చిత్రము కాథోలిక్ మతధర్మముననే కవి చూపెను. ఆధునికవిమర్శకు లీమఠములను బౌద్ధమఠములతో పోల్చెదరు. ఆ తపస్విని తన సోదరుడగు క్లాడియస్ ప్రాణావనోత్సాహినియై అర్ధ రాత్రమున నొంటరిగా ఏంజిలో చెంత కేగ, అతడు కామనిశాతశరాహతుడై నిజహృదయ మామె కెరిగింప, ఆమెరోతగించి ధర్మకోపమున (righteous indignation) "నాసోదరుని ప్రాణముకు మారు నాప్రాణముల నిచ్చెదగాని, వాటిని నిల్పుటకు నేను ధర్మధ్వంస మొనర్చి నాశీలమునకు కళంకము సోకనీయన"నెను*[1] పిమ్మట ఆ సోదరుడు మృతియందలి భీతిచే "పాపప్రవృత్తురాలవై నాప్రాణము గాపాడితివేని అది పుణ్యమే యగున"ని నిరోధింప ఆమె గురుగంభీరస్వరమున "ఓరీ, పశువా ! దురాచారుడా! పిరికిపందా ! నీ సోదరీశీలమునకు కళంకమద్ది నీప్రాణము లుండ జూచుకొందువా? ఇది ఘోరపాతకముకాదా? సోదరిమాన మమ్మి నీప్రాణములుగొనజూచెదవా ? ఇట్టి తుచ్ఛుడు త్వరలో చచ్చుట మేలు," అని వెడలిపోవును.

  1. * Isabella - Oǃ were it but my life, I'd throw it down for your deliverance As frankly as a pin............ And shamed life is hateful. Claudius - Sweet sister, let me liveː What sin you do to save a brother's life, Nature dispenses with the deed so far. That it becomes a virtue. Isabella.... O you beast ǃ O faithless coward ǃ O dishonest wretch ǃ Wilt thou be made a man out of my vice ? Is't not a kind of incest, to take life From thine own sister's shame? ........................................ O fie, fie, fie ǃ Thy sin is not accidental, but a trade, 'T is best that thou diest quickly. Measure for measure Act III