పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

121 మానవప్రేమ

ముడు సతీధర్మమును జ్ఞప్తికితెచ్చి, పతి నింటవిడిచి సతి వనముల కరుగుట అసంగతమని చెప్పగా మారుమాటాడక హృదయావేగమును కర్తవ్యనియమబలముచే నదిమింది. పతి ప్రేమయు పుత్రవాత్సల్యమును ఇరువంకల నామెహృదయము నాకర్షింప, డోలాందోళిత చేతస్కయై, కర్తవ్య మాత్మసంయమమునకు తోవజూప పతిని వీడి ఆ సతీమణి పదము పెట్టజాల కుండెను. పతిప్రేమతరంగము పుత్రవాత్సల్యతరంగము నణచెను, కావున పుత్రుని వీడ్కొని పతిసేవాపరాయణయై అయోధ్య యందే నిలువగల్గెను.

తండ్రియానతిచొప్పున రామునకు వనవాసమబ్బెను కాని లక్ష్మణు డేల నాతని వెంబడింప వలయు ? అ ట్లాతడేగిన వెన్కనైన సుమిత్ర అలమటింపదాయె! కౌసల్యకన్న ఈమె ధైర్య మెంతయెక్కుడో ఊహింప వశమా? ఆత్మసంయమ గాంభీర్యము రూఢ మగుటచేత ధైర్యము చిక్కబట్టి పుత్రుని వీడ్కొని పతిసేవాపరాయణ ఆయెను.

పాశ్చాత్యసాహిత్యమున ఆత్మశాసనప్రభావ మరయవలెనన్న షేక్స్‌పియర్ రచించిన ఇనబెలా చరిత్రము చూడండి. ఆమె ఐహికప్రేమ సర్వేశ్వరార్పిత మొనర్చెను. ఆర్య వితంతువు పత్యను రాగమును భగవదర్పణము చేయుచాడ్పున ఇనబెలా తన అనురాగమంతయు పరమేశ్వరునిపరము చేసి దైవప్రేమభరితయై బ్రహ్మచర్యము బూని ధర్మమఠము (convent) న ప్రవేశింపనెంచెను. ఆమె ధర్మానురాగ మత్యంత