పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106 సాహిత్య మీమాంస

శకుంతలా దుష్యంతుల అనురాగము రూపజ మనవచ్చును, కాని ప్రత్యాఖ్యానము చేసేటప్పుడు రాజు ఉత్కృష్టమగు ఆత్మసంయమన మగపరచి పాశవప్రకృతి నణగదొక్కెను. అతని మనస్సులోని శకుంతలరూపానురాగము బయట పడకుండ కవి లజ్జయను తెర మరుగుజేసి మాధుర్యము చేకూర్చెను. ఇట్టి మాధుర్యము పాశ్చాత్యప్రేమయందు కానరాదు. లజ్జ కేవల మాధుర్యమును కూర్చుటేకాక అనురాగమందలి పాపకళంకమును పరిమార్జించెను. రూపానురాగము విధివిపరీతమై క్రోధాదులయందు పరిణతమయితే పాపసంకులమగును. శకుంతలానురాగము ప్రబలాసక్తిగా పరిణమించక పూర్వమే దుష్యంతు డామెను పెండ్లియాడి తదనురాగము విధ్యనుకూలమగున ట్లొనరించెను. గాంధర్వ వివాహము క్షత్రియుల కుచితమే కావున పాపము దూరమాయెను.

ప్రాచ్య పాశ్చాత్య ప్రేమ చిత్రణము

అభిజ్ఞానశాకుంతల మారంభించునపుడే అపూర్వమగు ప్రేమచిత్రము ప్రాదుర్భవించును. శకుంతల ఆశ్రమతరులతాదులయెడ సోదరభావమూని, వాటి కుపచారము చేస్తూ, సఖులతో నిస్సంకోచముగా ప్రణయసల్లాపము సల్పుతూండును. వారు ముగ్గురూ సహకారమునకూ మాధవీలతకును పెళ్లిజేసి క్రీడాకౌతుకము కావించుకొనుచుండ, దుష్యంతుడు ప్రవేశించును. అతనిమ్రోలనున్న శకుంతల లజ్జాభరము