పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రాంహ్మణకోడూరు

83


వీరి జ్ఞాతి అయిన వెంక్కటేశం రావుగారు కల్తబెట్టినంద్ను విళంబ్బి సంవత్సరములో తాలూకా నర్సంన్న గారు వెంక్కటేశం గారు చేరి సఖంగ్గా పంచుకున్నంద్ను యీ గ్రామం వెంకటేశంగారి వంట్టులో చేరినది గన్కు సదరహి సంవత్సరం లగాయతు ఆనంద్ద సంవత్సరం వర్కు ప్రభుత్వములు చెశ్ని తర్వాతను తత్పుత్రుడైన వెంక్కట రమణయ్యా రాయనింగారు ప్రభుత్వానికి వచ్చి స్న ౧౨౨౧ (1811 AD) వర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.

పూర్వం జమిందాలు౯ వంట్లు పంచ్చుకోక మునుపు ఆమాని మామ్లియ్యతు జరిగే కాల మంద్దు యీ గ్రామాన్కు పెద్దకాపు అయ్ని రామనేని పాపినేడు యీ గ్రామాన్కు తూపు౯ భాగమంద్దు శివాలయం కట్టించ్చి శ్రీశైలం నుంచ్చి లింగ్గా౦న్ని తెప్పించ్చి, ప్రతిష్ఠ చేశి మల్లేశ్వరుడనే పేరు బెట్టి యీ దేవుంణ్ని అచ౯న చాయడాన్కు వల్లూరి నర్సప్ప అనే తపోధనుంణ్ని నిల్పి కు ౧ భూమి యినాం యిప్పించ్చినాడు గన్కు తదారభ్య యీ వర్కు అంతర్వు లేకుండ్డా ఆచ౯న జర్గుతూ వున్నది. విష్ణుస్తలం అంతర్వు పడి వుండ్డె గన్కు ఆక్షయ సంవత్సరమంద్దు చేరు మధురాదాసు అనే సాహుకారు యీ గ్రామం యిజారాకు తీసుకుని వేణుగోపాలస్వామి వారిని ప్రతిష్ఠ చేశి ఆలయం జీన్నో౯ద్ధారం చేశినారు.

యీ దేవున్కి నిత్య నైవేద్య దీపారాధనల్కు పూర్వం ఆగ్రహరీకులయ్ని వారు యిచ్చిన ప్రకారం కు ౨ పొలం మాన్యం జారీ చేయించ్చి తదారభ్య యీ వర్కు రధోత్సవములు మొదలయ్నివి జరిగిస్తూ వుంన్నారు.

రిమాకు౯ ను————
యినాములు ————
3 స్వామి వార్లకు
౧ మల్లేశ్వరస్వామి
౨ వేణుగోపాలస్వామి
౦ ౹ ఽ పిల్లలమఱి వెంక్కయ్య పురోహితున్కి
౦ ౪ ఽ అధ్యాపకులు వుప్పలూరి వెంకయ్య
౦ ౹ ౦ కంచ్చిబొట్లు రామబ్రహ్మ సోమయాజుల్కు
౦ ౹ ౦ వలుడి కుండ్డ బ్రంహ్మంన్న అయ్యవార్ల గారికి
——————
౪ ౹ ౦
——————