పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

గ్రామ కైఫియత్తులు


బ్రాహ్మవిద్వాంసులుంన్ను అయి వుందురు గన్కు అనవేమారెడ్డి గారు వీరియంద్దు కరుణించి మీకు అష్టభోగ సహితముగా గ్రామం అగ్రహారం యిస్తున్నాము కోరుకుంమ్మని ఆనతి యిచ్చి నంద్ను పయ్ని వ్రాశ్ని నాగేశ్వర శాస్త్రులు౯ గారు సదరహి గొల్లల కోడూరు కోరుకొంన్నారు గన్కు శాలివాహన శక వష౯ంబ్బులు ౧౨౮౪ శక (1362 AD) మంద్దు దానధార పూర్వకంగ్గా ధారాగ్రహితం చేశి తామ్ర శాసనములు వ్రాయించ్చి యిప్పించ్చినారు. స్వకుటుంబ్బ సమేతముగా వచ్చి యీ స్తలమంద్దు ప్రవేశించ్చినారు. వీరు వాడుకుంన్న హేతువు వల్ల నుంచ్చింన్నీ బ్రాహ్మణకోడూరు అని పేరు వచ్చినది గన్కు సదరు శాస్తులు౯ గారు యీ గ్రామమంద్దు ప్రవేశించ్చి గృహనిర్మాణములు చేసుకుని అన్నదానం చేస్తూ అష్ట భోగసహితంగ్గా అగ్రహారం అనుభవిస్తూ యీ గ్రామ మధ్యమందువిష్ణు స్తలం కట్టించ్చి వేణుగోపాలస్వామి వార్ని ప్రతిష్ఠ చేశి యీ దేవుని పూజించడాన్కు శ్రీనివాస వెంక్కటా చాలు౯ అనే విష్ణు సుంణ్ణి నిన౯యించ్చి స్వామి నిత్య నైవేద్య దీపారాధనలు జర్గుగలందుల్కు కు ౨ మాన్యం యిప్పించ్చినారు. వీరి తదనంతరం తద్వంశజులైన మల్లు శాస్తులు౯ గోవింద శాస్తులు౯ నాగేశ్వర శాస్తులు౯ మొదలయ్నివారు పిడివరు పిడేలుగా శాలివాహన శకం ౧౪౦౦ శకం (1578 AD) వర్కు రెడ్డి వడ్డె కనా౯టక ప్రభువులు ధర్మవంత్తులు గన్కు జరిగించ్చినారు.

అంతట నుంచ్చి మొగలాయి అధికారములు వచ్చుట వల్ల యీ గ్రామం సౌంజ్ఞ తప్పి కోరుకింద్ద దాఖలవుట వల్లను యీ అగ్రహారీకులు గ్రామాన్కు కణీ౯కపు సౌంజ్ఞ చాతను యజమానులని త్వవ్యవహారం జర్గించ్చేలాగ్ను హకములు కట్టడి చేశినారు. యీ కొండ్డవీటి శీమ సముతుబంధీలు చేశే యడల యీ గ్రామం పొంన్నూరు సముతులో చేరినంద్ను సముతు అమీలు చౌదరు దేశపాండ్యాల పరంగ్గా అమాని మామ్లియ్యతు జర్గినది. అప్పట్లో దేశాన్కి మహత్తైన క్షామ డాంబ్బరములు సంభవించ్చినంద్ను యీ అగ్రహారముల దగ్గిర వుంన్న తామ్ర శాసనములు వగయిరా దస్తావయిజులు హరించబడ్డవి. స్న ౧౧౨౨ ఫసలీ (1712 AD)లో యీ కొండ్డవీటి శీమ జమీదాల్ల౯కు మూడు వంట్లు చేశి పంచి పెట్టేయడల యీ గ్రామం మానూరి వెంక్కంనా మజ్ముదారు గారి వంట్టులో చేరినది గన్కు రాజా వెంక్కంన్నారావు గారు ప్రభుత్వం చేశేటప్పుడు మజుకూరి యజమానులయ్ని మాధవరెడ్డి గోవింద్దప్ప, నోరిలింగ్డం భొట్లు అనే అతని కొమాత్తె౯ను యిచ్చి వివాహం చేశి పాతికె భాగం మిరాశీ వ్రాశియిచ్చి తతింమ్మా ముప్పాతికెలో తద్వంశజులైన సంగప్ప అనే అతనికి భోగ నిన౯య ప్రకారం వీ 3 మూడు వీసాలు మిరాశీ యిచ్చెగన్కు అంత్తట నుంచి అతని సంత్తతి వారు సంగ్ల వారనే యింటి పేరు కల్గి సదరహి వీ 3 మూడు వీసాలు అనుభవిస్తూ వుంన్నారు తతింమ్మా వారు పూర్వనామం చాతనే తొంమ్మిది వీసాలు అనుభవించ్చేలాగ్ను నిన౯యం చేసుకుంన్నారు. సదరహి తాలూకా ప్రభువులయ్ని వెంక్కంన్నగారు అప్పాజీ పంత్తులు వెంక్కటాయునింగ్గారు వెంక్కట కృష్ణునింగారు అధికారము చెశ్ని తర్వాతను వెంక్కట కృష్ణునింగారి కొమారులయ్ని నరసంన్నారావు గారు ప్రభుత్వం చేస్తూ వుండ్డగా