పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

81

బ్రాంహ్మణకోడూరు

కైఫియ్యతు మౌజే బ్రాంహ్మణకోడూరు సంతు పొంన్నూరు సర్కారు ముత్తు౯

జాంన్నగరు తాలూకే సత్తినపల్లి.

యీ గ్రామం పూర్వం గొల్లల మంద్ధ చేచు౯కుని పాలెంకట్టుకుని వుండినంద్ను గొల్లల కోడూరు అని ఆ గ్రామాన్కి పేరు వచ్చ్నిది.

దొంత్తి అల్లా రెడ్డి కొడుకులయ్ని పెదవేమారెడ్డి మొదలయ్ని వారు ప్రభుత్వములు చేశ్ని తర్వాతను, అనవేమారెడ్డిగారు ప్రభుత్వాన్కు వచ్చి క్షాత్రవంత్తుడయినంద్ను. వినికొండ్డ, బెల్లంకొండ, కొండవీడు మొదలయిన २౨ దుగ౯ములు పాలన చేస్తూ యీ కొండ్డవీటిశీమలో బ్రాంహ్మణుల్కు ౪౪ అగ్రహారములు ధారాగ్రహితం చేశినారు. యింద్కు శ్లోకం.

శ్లొ౹౹ తేషాం శ్రేష్టతమో రాజన్ వేమ భూ
పాల నుత్తమ: బ్రాంహ్మణే భ్యశ్చ పంచ్చమ ।
వెలనాటి కులేభ్యశ్చ షట్త్రింశ గ్రామ నుత్తమం ౹౹

శ్లొ౹౹ తేషాం శ్రేష్ఠతమో రాజా
వేమ భూపాల సత్తమ!
వేగినాటికులేభ్యశ్చ....
బ్రాహ్మణేభ్యశ్చ పంచమం
గ్రామత్రయం తథాదత్తం
తధా ద్రావిడేభ్యశ్చ
పంచమం - వెలనాటికులేభ్యశ్చ
షట్త్రింశ గ్రామ నుత్తమం ॥

తా౹౹ ఆ రాజులలో వేమరాజు చాల మంచివాడు - ఆతడు వేగినాటి బ్రాహ్మణులకు 3 అగ్రహారములను, ద్రావిడ బ్రాహ్మణులకు అయిద గ్రహారములను వెలనాటి బ్రాహ్మణులకు 6 అగ్రహారములను దానము చేసెను.

యీ ప్రకారంగా వేగినాటి వారికి 3 ద్రావిడుల్కు, వెలనాటి వారికి ౩౬ వెరసి ౪౪ గ్రామాదులు అష్ఠ భోగసహితముగా అగ్రహారములు యిచ్చినారు గన్కు యీ గ్రామం వెలనాటి సంఖ్యలో చేర్ని ౩౬ అగ్రహారములలోది గన్కు యీ బ్రాంహ్మణకోడూరు ఆగ్రహార మయ్ని నయినం, మాధవ పెట్టి నాగేశ్వర శాస్త్రులు౯గారు బహుతపస్సంపన్నులుంన్ను