పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెదనందిపాడు

79


వడ్డె రెడ్డి ప్రభుత్వములు జర్గిన తర్వాతను కన్నా౯టక రాజైన కృష్ణరాయులు వారి అధికారంలో రాయిని భాస్కరుని గారు యీ తాలూకా ప్రభుత్వం చేశినారు.

శా ౧౫౦౦ శకం (1578 AD) వర్కు కన్నా౯ట్క ప్రభుత్వములు జరిగిన తర్వాతను మొగలాయి ప్రభుత్వములో గుంటుపట్టి ముత్తు రాజయ్య గారు చాలా దినములు ప్రభుత్వం చేశినారు. తదనంత్తరం పాదుశాహలు దేశముఖు దేశపాండ్యా మొదలయ్ని బారాముత సద్ధి హోదాలు నిన్న౯యించ్చే యడల రామరాజు వార్కి దేశముఖు హోదా యేప౯డి ప్రభుత్వం చేశిరి. తదనంత్తరం గుంట్టుపల్లి భాస్కరుని వారు మొగలాయి వారికింద్దను అధికారం చేస్తూ పుండ్డి రాచకార్యం తొంద్దరను గురించ్చి వినుకొండ్డ పర్షణా జమీదారి చేస్తూ వుంన్న మల్రాజు సూరంన్న గార్ని తీస్కు వచ్చి వినుగొండ్డ తాలూకా వారి పరం చేశి వీరు స్తల కరణీకము హోదాలో వుండ్డుకుంన్న తర్వాత సూరంన్న గారి ఆధికారం జర్గిన తర్వాతను రామారాయినింగ్గారు ప్రభుత్వం చేశేటప్పుడు అధ౯తొందరను గురించ్చి వినుకొండ్డశీమలో పాత్కి పూళ్లు పంట్టుచేశి వాశిరెడ్డి నర్సంన్నగార్కి విక్రయించ్చి యిచ్చిరి గన్కు యీ గ్రామం పాతికె వంట్టులో చేరినది గన్కు నర్సంన్న గారు సూరంన్నగారు చ్ని నర్సంన్నగారు చ్ని రామలింగ్లంన్నగారు జగ్గయ్యగారు రామంన్న గారు ప్రభుత్వములు జర్గిన తర్వాతను పైయ్ని వ్రాశ్ని జగ్గయ్యగారి కొమారులయ్ని రాజా వెంక్కటాద్రి నాయుడు గారు ప్రభుత్వాన్కు వచ్చి స్న ౧౨౨౧ ఫసలి (1811 AD) వర్కు ప్రభుత్వం చేస్తూ వున్నారు.

రిమాక్కు౯ గుడికట్టు కుచ్చళ్లు ౮౦౮ కి మినహాలు-
౧ గ్రామకంఠం
౮ చెర్వులు ౮కి
౧ గ్రామాన్కు పశ్చిమం గ్రామచెర్వు
౧ నైరుతి భాగం నూతివారిది
౧ దక్షిణం వెపు.. వారిది
౧ పశ్చిమ తుమ్మలి వారిది
౧ దక్షిణం గర్కిపాటి వారిది
౧ పడ్మట సాలె వారిది
౧ పశ్చిమాన నూతి బొల్లప సాలెం దగ్గిర
౧ దక్షిణం సుంక వారిది
——