పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

పెదనందిపాడు

కైఫియ్యతు మౌజే పెదనంద్ధిపాడు పర్గణె వినుకొండ్డ పాతికె వంట్టు తాలూకే

చింత్తపల్లి.

పూర్వం యీ స్తలం అరణ్యంగా వుండ్డు గన్కు దక్షిణ దేశము నుంచ్చి పెదనంద్ది రెడ్డి అనేవారు యిద్దరు అంన్నదమ్ములు పశువుల మంద్ధతోటి యీ స్తలముకు వచ్చి పశువులు మేపుతూ వుండ్డి తత్సమీపమంద్దు వక గొల్లవాడు మేకల మేపుతూ వుంట్టే యీ ప్రదేశం యెన్నడయినా పాడా అని అడిగితే ఆ గోపకుడు యంన్నట్కి పాడుగాదు అని చెప్పినాడు గన్కు ఆ పెదనంద్దిరెడ్డి అధ౯ వంతుడై నంద్ను యీ ప్రదేశమందు పాలెం కట్టించ్చి తన పేరిట పెదనంద్ధిపాడు అని పేరు బెట్టినాడు యీ పెదనంద్ది రెడ్డి తమ్ముడైన చిననంద్ది రెడ్డి త్మఆంన్న కట్టించిన గ్రామాస్కు కోశెడు దూరానను పూర్వం తాను పశువులు మేపుకొన్న స్తలం పట్టున పాలెం కట్టి తనపేరిట చ్నినంద్దిపాడు అని పేరు బెట్టినాడు.

పయ్ని వ్రాశ్ని పెదనంద్ధిరెడ్డి తాను కట్టించి పాలేన్కి పశ్చిమ పాశ్వ౯ం చెర్వు తవ్వించి ఆ చర్వు పుత్తరవు కట్టమీదను శివాలయం కట్టించ్చి సోమేశ్వరస్వామి వారనే లింగ్ల మూత్తి౯ని ప్రతిష్ఠ చేసినాడు గంక అప్పట్లో ప్రభుత్వం చేశే వారు యీ దేవున్కి నిత్య నైవేద్య దీపారాధనల్కు కు ౦౻౦ భూమి మాన్యం యిచ్చినారు.

తదనంత్తరం గణపతి మహారాజులుంగారి ప్రధానులయ్ని గోపరాజు రామంన్న గారు శా ౧౦౬२ శక (1145 AD) మంద్దు బ్రాహ్మణుల్కు గ్రామాల మిరాశీలు నిన్న౯యించ్చే యెడల యీ పెదనంద్ది పాట్కి యజుశ్శాఖాధ్యాయనులున్ను కౌండ్డిన్యస గోత్రులుంన్ను అయ్ని సంక్కు గుర్రాజు అనే అరువేల నియ్యోగ్కి మజ్కూరి కణీ౯కం మిరాశి యిచ్చినారు గన్కు ఆతను మిరాశీ రస్మితేజోపాజు౯నులు అనుభవిస్తూ యీ గ్రామమంద్దు వున్న శివాలయాన్కు వుత్తరం కొంచ్చెం యీశాన్య భాగమంద్దు విష్ణుస్తలం కట్టించ్చి మదనగోపాల స్వామి వార్ని ప్రతిష్ఠ చేశి నిత్య నైవేద్య దీపారాధనల్కు కు ౦౺౦ భూమి మాన్యం యిచ్చి కరిణీకం చేస్తూ వుండ్డే యడల యీ గుర్రాజు కుమార్తె౯ పుట్టినంద్ను భారద్వాజ గోత్రుడయ్ని రాపూరి రమణప్ప అనే చింన్నవాడ్కి తన కుమార్తె౯ను యిచ్చి వివాహం చేశి మజ్కూరి మిరాశిలో అయిదో భాగం మిరాశి నిన౯యించ్చినారు గన్కు ఉభయులు అనుభవిస్తూ వుంన్నారు.