పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

గ్రామ కైఫియ్యత్తులు


స్న ౧౧౪౧ (1731 AD) ఫసలీలో ప్రభుత్వాన్కు వచ్చి స్న ౧౧౪౩ (1733 AD) ఫసలీ వర్కు 3 మూడు సంవత్సరములు ప్రభుత్వం చేశెను.

అటుపిమ్మట స్న ౧౧౪౪ (1734 AD) ఫసలీలో రాజా వెంక్కటరాయనింగ్గారు ప్రభుత్వాన్కు వచ్చి పయ్ని వ్రాశి ప్రకారంగ్గా స్వామి వార్కి సకలోత్సవములు జరిగిస్తూ యిచ్ని యినాములు.

రావూరి సంజీవరాయనింగార్కి కు ౧ కుచ్చల యినాములు యిప్పించ్చి స్న ౧౧౬౪ (1754 AD) ఫసలీ వర్కు ౨౧ సంవత్సరములు ప్రభుత్వం చేశెను.

తదనంత్తరం వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వాన్కు వచ్చి యిచ్ని యినాములు.

కు ౦ ౺ ౦ కుంపాల పొన్నయ్య చాల౯ గార్కి
కు ౨ ౺ ౦ విరిరాజు బంధువులయ్ని కాడికనప్ప మూర్తులు గారికి స్న ౧౧౮౩ ఫసలీ (1773 AD) లోను
కు ౦ ౹ ౦ .....కుంచ్చరకు బాదికి
కు ౦ ౹ ౦ ......నారాయణా చాల౯ గార్కి
కు ౦ ౹ ౦ ........తాడదేవగిరి
కు ౦ ౹ ౦ ............అక్కంబొట్లు' స్న ౧౦౮౧( 1771 AD) ఫసలీలో యిచ్నిది.
కు ౦ ౺ ౦ మైదువొలు రామంన్నకు.
కు ౦ ౺ ౦ తాడికొండ్డ వెంక్కయ్య సరాభు మాన్యం.

యినాములు యిప్పించ్చి స్న ౧౧౬౫ (1755 AD) ఫసలీ లగాయతు స్న ౧౧౮౪ (1774 AD) వర్కు ౨౦ సంవత్సరములు ప్రభుత్వం చేశెను. తరువాత కొమారులయిన రాజా నరసంన్న గారు ప్రభుత్వాన్కు వచ్చి యిచ్చిన యినాములు.

౧ మద్దూరు కాపు బుచ్చయ్యకు స్న ౧౧౮౫ ఫసలీ (1775 AD)లో యిచ్ని యినాములు.
౧ మచ్చ పరుశరాములప్పకు స్న ౧౨౦౧ ఫసలీ (1791 AD)లో యిచ్ని యినాములు-