పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూసులూరు

73


తదనంత్తరం కాకత గణపతి కుమార కాకతీయ రుద్రదేవమహారాజులుంగాలు౯ శా ౧౨౪౧ (1319 AD) శకం వర్కు ప్రభుత్వం చేసిరి. సదరహి స్వామి వాల్ల౯కు పుండుకుంన్న వృత్తులు నిరాటంక్కంగా జరిగించి వారయి నిత్యోత్సవములు మొదలయ్ని ప్రభలోత్సవములు జరిగించ్చినారు. అటుపిమ్మట రెడ్లు బలవంతులై పరసవేది వల్ల అన్కే ధనం కూచి౯ గిరి దుగ౯ స్తల దుగ౯ములు నిర్మాణం చేసుకుని కొండ్డవీడు రాజధానిగా వశియించ్చి ఆరుగురు రెడ్లు శా ౧౨౪౨ (1320 AD) శకం లగాయతు శా ౧౩౪౨ (1420 AD) శకం వర్కు నూరు సంవత్సరములు ప్రభుత్వం చేశినారు. గన్కు వారుంన్ను యీ దేవస్తానములు మరామతు చేయించ్చి మామూలు ప్రకారం జరిగించ్చినారు.

తర్వాత వడ్డెరెడ్డి కనా౯టక రాజులు శా॥ ౧౫౦౦ (1578 AD) శకం వర్కు ప్రభుత్వం చేశ్ని తర్వాతను మొగలాయి ప్రభుత్వం వచ్చెగన్కు కొండ్డవీటి శీమ సముతు బంద్దీలు చేచేటప్పుడు యీ గ్రామం గుంట్టూరు సముతులో దాఖలు చేశి మల్కి విభురాం సుల్తానబ్దులా తానీషా అలంగ్గీరు పాదుశహాలు తమ తరపు ఆమీళ్ళ పరంగ్గా దేవస్తుల మూలముగా స్న ౧౧౨౧ (1711 AD) ఫసలీవర్కు అమానినమామలీయ్యతు జరిగించ్చినారు గన్కు బహుస్వాస్త్యములు జరగలేదు. స్న ౧౧౨౨ (1712 AD) ఫసలీలో కొండవీటి శీమ మూడు వంట్లు చేశి జమీదాల్లు౯కు పంచ్చి పెట్టేయడల యీ గ్రామం సర్కారు మజుంద్ధారులయ్ని మానూరి వెంక్కన్న పంత్తులు గారి వంట్టులో వచ్చి చిల్కలూరిపాటి తాలూకాలో దాఖలు అయ్నిది. గనుక వెంక్కన్న పంతులు గారు ప్రభుత్వం చేస్తూ శ్రీ స్వామి వారి౯ యొక్క దేవాలయములు మరామతు చేయించ్చి మొగలాయివారు నిన౯యించి ప్రకారం జరిగించిన స్వాస్త్యములు--

శ్రీ స్వామి వాల౯ నిత్య నైవేద్య దీపారాధనలకు యిచ్ని మిరాశీలు
..........శ్రీ మల్లేశ్వరస్వామి వార్కి
..........శ్రీ వేణు గోపాలస్వామివార్కి

..........నా వచ్చె పండ్డుగలు శ్రీ రామ నవమి గోకుల అష్టమి నవ....శివరాత్రి శ్రావణ కాత్తి౯క మాస అభిషేకములు మొదలయ్నివి.

...........మొదలయ్ని వుత్సవముల్కు..........చునిచాయించ్చె..........నిన౯యించ్ని వెంన్నులు (హొన్నులు).

౧౨౻౦ శ్రీ............స్వామివార్కి
౧౨౻౦ శ్రీ వేణుగోపాల స్వామి వార్కి

యీ ప్రకారంగ్గా నిన౯యించ్చి సదరహి ఫసలీ లగాయతు స్న ౧౧౪౦ (1730 AD) ఫసలీ వర్కు ౨ం సంవత్సరములు ప్రభుత్వం చేశెను. తదనంతరం అప్పాజీ పంత్తులు