పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

పూసులూరు

కయిఫియ్యతు మవుజే పూసులూరు సంతు గుంట్టూరు సర్కారు మృతు౯

జాంన్నగరు మవుజే తాలూకె చిల్కలూరుపాడు రాజామానూరు వెంక్కట కృష్ణా

రావు మజ్ముందారు గారు.

యీ గ్రామాన్కు పూర్వం నుంచి పూసులూరు అనే పేరు వుంన్నది.

గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగ్గారు శాలీవాహనం ౧౦౫౬ (1134 AD) శకం మొదలుకొని ప్రభుత్వం చేశేటప్పుడు వీరి దగ్గర మహాప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు స్వస్తిశ్రీ శాలివాహన శక వష౯ంబ్బులు ౧౦౬२ (1145 AD )ఆగునేటి......రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద బ ౩౦ అంగ్గార్క వారం సూర్యోపరాగ కాలమంద్దు కృష్ణానది స్నాన కాలమంద్దు ప్రభువు దగ్గిర దానంపట్టి సమ స్తమయ్ని నియ్యోగులకు గ్రామ కరిణీకపు మిరాశి సనదులు వాయించ్చి యిచ్చే యడల గ్రామాన్కు వెలనాడు భారద్వాజ గోత్బలయ్ని చంన్నా ప్రెగడ వారి సంప్రతి ౧కి అరువీసాలు యాజ్ను (జ్ఞ) వల్కుల సంప్రతులు ౨కి కౌండిన్యస గోత్బలయ్ని గంధం వారి సంప్రతి ౧కి అయిదు వీసాలు శ్రీ వత్సగోత్సలయ్ని పూసలూరి వారి సంప్రతి ౧కి అయిదు వీసాలు వెరశి మూడు సంప్రతులు వారికి పదహారు మిరాశి నిన౯యించ్చినారు. గన్కు తదారభ్యాయే తద్వంశజులైన వారు...........గా గ్రామ కరిణీకపు మిరాశీ రస్మితేజోపాజు౯నలు అనుభవిస్తూ పుంన్నారు. తదనంత్తరం కోట కేతరాజు గారు శాలివాహనం ౧౧౦౪ (1182 AD) శకం లగాయతు ధరణీకోటలో నివశించ్చి ప్రభుత్వం చేశేటప్పుడు వొకానొక సమయమంద్దు యీ గ్రామం యెదురుగా యిక్షుపురి ప్రతి నామధేయమయ్ని చెర్కూరు ఆ ప్రాంత్యముల్కు వెళ్లుతూ యీ గ్రామంలో దేవస్తలముల్కే వుండే గన్కు అప్పుడు యీ గ్రామాన్కు పశ్చిమ భాగం నైరుతి మూలను శివానియం కట్టించి శ్రీ మల్లేశ్వరస్వామి వారనే లింగమూతి౯ని ప్రతిష్ట చేశి యీ స్వామివారిని పూజించడానకు వల్లూరి శివలింగం అనే శివద్విజుణ్ని నిన౯ యించ్చి అటుపిమ్మట పయ్ని వ్రాశ్ని మల్లేశ్వరస్వామ వారి దేవాలయాన్కి యీశాన్యం గ్రామాన్కు సహజా పశ్చిమం విష్ణుస్తలం కట్టించ్చి శ్రీ వేణుగోపాల స్వామి వారిని ప్రతిష్ఠ చేశి పూజించడాన్కు వేదాంత్తం నరసాచాలు౯ అనే వైఘనసులను నిన౯యించ్చి యీ స్వామి వాల౯కు నిత్యనైవేద్య దీపారాధనలకు జరగగలందులకు చేశ్ని వృత్తులు-

కు ౨ ౺ ౦ శ్రీ మల్లేశ్వరస్వామి వారికి
కు ౨ ౺ ౦ శ్రీ వేణుగోపాలస్వామి వారికి
—————————
కు ౫ యినాములు నిన౯యించ్చినారు.
—————————