పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

గ్రామ కైఫియత్తులు


ఆప్పంన్నగారు సదరహి ప్రకారం యీ గ్రామములు మనోవృత్తి అనుభవిస్తూ యీ గ్రామం మాన్యాలు

౦ ౺ ౦ అంబడిపూడి అన్నంభొట్లుగార్కి
౦ ౹ ౦ తంగ్గిరేల కుంచంభొట్లుకు
౦ ౺ ౦ పిట్ల వెంక్కట బొట్లుకు
౦ ౺ ౦ పురాణం వెంక్కట నరసుగార్కి
౧ ౺ ౦ పుల్లలకు
౧ అచి౯రాఘవాచాలు౯ గారికి
౦ ౹ ౦ గుడిమెళ్ళ నరశింహ్వాచాలు౯ గారికి
———————
౨ ౻ ౦ రెండు కుచ్చళ్లు ముప్పాతిక యినాములు

యిప్పించి అప్పంన్న గారు వీరి కొమారులు అయ్ని జంగంన్నా చిన్నప్పగారు స్న ౧౨౧౦ ఫసలీ (1800 AD) వర్కు మనోవృత్తి అనుభవించ్చిన తరువాతను ఆ ఫసలీలోనే మహారాజు కుంఫిణివారు దేశ పాండ్యాల వారు మిరాశీతాజా చేసిరి గన్కు జమీదారులుంన్ను యీ గ్రామాదులలో మనోవృత్తి జరిగించ్చలేదు గన్కు ౧౨౧౧ ఫసలీ (1801 AD)లో రాచూరు తాలూకా యాలం వేశినంద్ను యీ గ్రామం రాచూరు తాలూకా అయ్నిది గన్కు రాజామల్రాజు వెంక్కటగుండ్డారాయని గారు సదరహి తాలూకా కొనుక్కుని యిదివర్కు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు గన్కు ఆచి౯ రాఘవాచాల౯ గారు గుడిమెళ్ళ నరశింహాచాల౯ గారి మాన్యములు- కు ౧౹౦ శివాయి తతింమ్మా యినాములు జరిగిస్తూ వుంన్నారు. రిమాకు౯ గ్రామ గుడికట్టు కుచ్చళ్ళు ౬౦

కి మ్నిహాలు

౦ ౻ ౦ గ్రామ కంఠం
౦ ౺ ౦ మాలపల్లెలు ౨కి
౫ చవుడు కాడు
౨ చెరువును 3 కి
౧ ౺ ౦ బలభద్రపాతృనివారు వేయించ్ని దేవతలు ౨కి
౦ ౺ ౦ యడ్లపల్లి వారు చేయించ్ని చెరువు నికి
౦ ౹ ౦ కుచ్చలు 3 కి