పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పచ్చలతాడిపర్రు

69


మొగలాయి రాజ్యం. ఆయెను గన్కు కొండవీటి సీమకు మృత్తు౯జాం నగరు సర్కారు లేము జేబు పద్నాల్గు వంతులు యేప౯రిచే యెడల యీ గ్రామం కూచిపూడి వంతులో దాఖలు చేశినంత ఆమీళ్ళ పరంగ్గా బహుదినములు అమానీ మామ్లియ్యతులు జరిగించినారు.

స్న ౧౧౨౨ ఫసలీ (1712 AD)లో కొండ్డవీటి శీమ వంట్లు దేశి జమీందాల౯కు పంచ్చి పెట్టేయెడల యీ గ్రామం బలభద్రపాత్రుని అప్పన్న దేశ పాండ్యాగారి వంతు ౪౫ నలభై ఆయిదు గ్రామాదులు చేరినందున ఆయన ప్రభుత్వం చేస్తూ మ ౧౻ మజ్కూరిలో వుండే శ్రీ మండలేశ్వర వేణుగోపాల స్వామి వాల౯ ఆలయములు పునహా మరంమ్మతు చేయించ్చి పూర్వీకమయ్ని వృత్తులు మొగలాయి అమానీలు జరగ్కపోయను గన్కు వును........ధారకంగా శ్రీ స్వామి వార్లకు శ్రీ స్వామి వాల్ల౯ను సంన్నిధానమంద్ను స్వస్తి వాచకములు చెప్పగలంద్లుకు శ్రీ బ్రాహ్మణులకు యిచ్చిన వృత్తులు మొదలయినవి :-

కు ౧ ౻ ౦ నిత్యనైవేద్య దీపారాధనలు జరగగలంద్లులకు స్వామి వాల౯కున్ను స్వస్తి వాచకం చెప్పే బ్రాహ్మడికి యిచ్చిన పొలం వేసరిపాటు.
కు ౧ ౺ ౦ శ్రీ స్వామి వాల౯కు
౦ ౺ ౨ శ్రీ మండలేశ్వరస్వామి వార్కి
౦ ౺ ౨ శ్రీ గోపాలస్వామి వార్కి
౦ ౹ ౦ స్వస్తి వాచకం చెప్పుతూ వుండ్డవలశ్ని పురాణం నర్సన్న గార్కి
౧ ౨ ౨ శ్రీ రామనవమి గోకుల అష్టమి నవరాత్రము శివరాత్రి వగయిరా సంవత్సరోత్స వములకు స్వామి వాల౯కు సాలీనా :::నిన౯యించినవి :
౬ ౮ శ్రీ మండ్డలేశ్వర స్వామి వారికి
౬ శ్రీ గోపాలస్వామి వారికి

యీ ప్రకారంగా నిన౯యించ్చి సదరహి ఫసలీ మొదలుకుని కొన్ని సంవత్సరములు వుత్సవం చేసి చనిన పిమ్మట యీయన కుమారుడయ్ని పాపంన్న బహుకర్మఠుడుగా వ్యవహారం జరిగించ్చుగుంట్టూ వుండే సమయంలో యీ మాణిక్యరావు బలవంత్తం చేతను యీ తాలూకా ఆక్రమించుకుని యీ పాత్రుని వారు కాపురం వుంన్నా వలివేరు యడ్లపల్లియందురు. చినగాదెలపర్రు అంగలకుదురు, కండెపాడు వగయిరా గ్రామాదులు వీరి..............న్ను గ్రామాములోనే చేరినంద్ను పాపంన్నగారు కొన్ని దినములు అనుభవించ్చిన తరువాతను వీరి ఆంన్నగారు అయ్ని చన్నప్పగారికి మజ్కూరిలో కు. ౫ అయిదు కుచ్చళ్ళ మాన్యంబులు యిచ్చినారు గనుక అనుభవిస్తూ వీరి కొమారుడయ్ని