పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కైఫీయతులందలి భాష

29

భూతకాలక్రియాజన్యవిశేషణమైన ఉండినకు, ఉన్న అనురూపము రాదు. అయినను లోకమునందును, కావ్యములందును, క్రియాజన్యవిశేషణముగా కూడ ఉన్న అనునది విరివిగా కనబడుచున్నది. కైఫీయతులలో వున్నది అను రూపము పలుసార్లు కానవచ్చును. ఉన్న + అది = ఉన్నది

బహువచనరూపములు

కుమారుడను శబ్దమునకు కొమరుడు, కొమారుడు, అనునవి వికృతి రూపములు, కొమారుడు అనుదానికి బహువచనరూపము కొమారులు. “రు” లోని ఉత్వమునకు లోపము రాగా, కొమార్లు, అను రూపమేర్పడును. బహువచనక్లిష్టములై అద్విరుక్తములైన “డ”కార లకారములకే అలఘు “ల”కారము కలుగునని వ్యాకరణము చెప్పుచున్నను, రకారమునకు కూడ వచ్చుననుటకు లోకమున పెక్కుప్రయోగము లున్నవి అందుచే కొమార్లు, కొమాళ్లు అగును. కైఫీయతులలో కొమాళ్లు అను రూపమే కాక, కుమాండ్లు, అను రూపము కూడ నొక్కచో వాడబడినది. ఆ కాలమున నిట్టి ప్రయోగము కూడ నుండెను కాబోలును. కాప్రత్యయముమీది బహువచన “ల”కారమునకు లఘ్వలఘురేఫమునకు ముందు బిందు పూర్వక “డ” కారమును అగును. దీనినిబట్టి పాలెగాడు, కమతగాడు, అను కా ప్రత్యయాంతములకు పాలెగాండ్రు, కమతగాండ్రు, లేక పాలెకాఱు, కమతకాఱు అనురూపము లేర్పడవలెను. కాని కైఫీయతులలో అను రూపములు వాడబడినవి. వాడు అను సర్వనామమునకు బహువచనమున వారు, వారలు, వాండ్రు, అను రూపములు కలవు. కైఫీయతులలో వారలు, (వార్లకు) వాండ్లు అను రూపములు వాడబడినవి. పశులవాండ్లు, గారు అనునది గౌరవార్ధము, వాడు ప్రత్యయము. ఇది చేరునపుడు, నామమును సూ(చిం)చుంచు పదమునకు చివర ని, లేక నిం. అను ప్రత్యయము కనబడుచున్నది. ఉదా:- బాస్కరునిగారు, మాణిక్యారాయనింగారు, కొన్ని కైఫీయతులలో కృష్ణనింగారు: అనుపేరు కూడ కనబడుచున్నది. ఇది బహుశః కృష్ణునింగారు అయి ఉండును. పంతులుగారు అను ప్రయోగము కూడ నున్నది.

వ్యావహారికప్రయోగములు

కైఫీయతులందు కనబడు కొన్ని వ్యావహారికపదములు ఇదివఱకే సూచింపబడినవి. అవి కాక యింకను వ్యావహారికప్రయోగము లెన్నియో ఉన్నవి. ఎడల అనునది 'యడల' అని పెక్కుచోట్ల వ్రాయబడినది. దానికి సమయము నందు అను నర్థము కూడనున్నది. ఆ అర్థమే కైఫీయతులలో పెక్కుచోట్ల కానవచ్చును. ఉదంతజడము తృతీయకు నవర్ణక మగునని వ్యాకరణము చెప్పుచున్నది. కైఫీయతులలో దక్షిణాదిన అను రూపము వాడబడినది. దక్షిణాదిని అని యుండుట యుక్తము. చూచు ధాతువునకు చూచి, అనునది క్త్వార్థకరూపము. కాని వాడుకలో చూసి అనునదే ఎక్కువగా వినబడును. అది కైఫీయతులలో కూడ కలదు. తెలుగున ను (ఉను) అనునది సముచ్ఛయము. ఇది వాడుకలో ద్విత్వయుక్తముగా కానవచ్చును. కైఫీయతులలో ద్విత్వయుక్తరూపమే కాక దానికి ముందు పూర్ణబిందువు కూడ కనబడుచున్నది. మరి అను దానికి సముచ్ఛయము చేరినచో "మరియును" అగును. ఉ లోపించినచో మరిన్