పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

గ్రామ కైఫీయత్తులు

ఉండబడ్డషువంటి (ఉన్నట్టి) అనురూపము లిందు కుదాహరణములు: చేయుము + అని = చేయుమని అగును; చేయందలి ఏకారమనకు హ్రస్వత చేకూరినప్పుడు యకారమునకు ద్విత్వము వచ్చుట సహజమే. కాని యు అందలి ఉత్వము నత్వముగా మార్చుట యుక్తము కాదు. కాని వాడుకలో నిట్టిప్రయోగము లనేకములు. అనుప్రయుక్తమైన పడు ధాతువునందలి 'ప' లోపింపగా, “అడు” అనునది మాత్రము మిగిలిన రూపములు కొన్ని కలవు. పాడుపడి, అనుటకు “పాడడి” అను రూపము వాడబడినది. ధాతువులకు 'ట' చేర్చినచో భావార్థక మేర్పడును. ఈ “ట” ప్రత్యయమునకు బదులు "అడము” అనునది కొన్ని చోట్ల చేరుచుండును. “ప్రతిక్రియ మడాంతత్వం శ్రూయతే నతు దృశ్యతే” అని అథర్వణుడు చెప్పి యుండెను. దీనినిబట్టి అడాంతరూపములు అతనినాటికి వాడుకలో నుండెనని తెలియుచున్నది. కైఫీయతులలో చేయడాన్కు, నడవడము, పూజించడాన్కు, మున్నగు రూపములు కానవచ్చుచున్నవి. “జమాయించుకొని” “మణాయించు", మొదలగు నన్యదేశములతో ఏర్పడిన ధాతువులు కూడ నిందు కానవచ్చుచున్నవి.

సంధులు

కైఫీయతులలో విసంధి పాటించినచో ట్లక్కడక్కడ కన్పించుచున్నవి. కొండమీద ఆలయం కట్టి, కరణాలు అప్పయ్య, బుచ్చివెంకయ్య, వ్రాయించినది, అనున విందులకు దృష్టాంతములు. సంధి లేనిచోట, యడాగమము వచ్చినచోట్ల కూడ నచ్చటచ్చట కానవచ్చును. ఉదా :- మిరాశీ యిచ్చినారు, చేసి యీ దేవరకు నీయందు, వొకానొకయుపద్రవము మున్నగునవి. ఉత్తున కచ్చు పరమగునపుడు, హరియించినవాడయి, అనుదానియందు వలె సంధి జరిగినచోట్లు కొన్ని ఉన్నను యడాగమము వచ్చినచోట్లే ఎక్కువగా కానవచ్చును. వారు యిచ్చిన, రాజులు యీ దేశానికి, మల్లినాయకులు యీ దేశం, క్షేత్రం యిచ్చినట్లుగా, మహారాజులు యీ దేశం, సంవత్సరమందు యీ గ్రామం. మున్నగున విందులకు దృష్టాంతములు. ద్రుతప్రకృతములమీద కూడ యడగామములు వచ్చిన ప్రయోగములు అసంఖ్యాకములుగా నున్నవి. నిన్నన్ యించ్చే యెడల యీగ్రామానికి, నియ్యోగికి యేకభోగంగా యిచ్చినట్లుగా యీ దేవాలయం వద్ద, వెలమవారికి యీ పరగణా మొఖసాగా యిచ్చి, అనునవి దృష్టాంతములు. "యీ గ్రామం పడమటివైపు కొండమీద మల్లిఖార్జునస్వామివారి దేవాలయముకు దక్షిణం దోవ వున్నది.” "యిది పూర్వం త్రేతాయుగమందు రామస్వామివారు, " “మున్నగుచోట్ల” “య” కారముతోనే వాక్యము లారంభించు చున్నవి. కస్తూరి+అయ్య = కస్తూరయ్య, ఎరకల + అయ్య = ఎరకలయ్య అనుచోట, అయ్య పరమగుటచే సంధియైనది. పడు ధాతువునకు భూతకాలక్రియాజన్యవిశేషము, పడిన, అట్లే ఉండు ధాతువునకు ఉండిన, పడ్వాదుల నవర్ణకంబున కత్వంబును, కడహల్లునకు ద్విత్వంబును విభాష నగునను వ్యాకరణసూత్రముచే, పడిన అనునది పడ్డ అగును. పడ్డతో కూడిన రూపములు కైఫీయతులలో చాల కలవు ఉదా :- ఏపన్డ్డవి. చేదాద్యర్థనాంతమైన ఉండునకు న్నాదేశము విభాష నగును. దీనినిబట్టి ఉండిన అనునది, ఉన్న యగును. కైఫీయతులలో అచ్చయిన ఉకారమునకు బదులు “వు” అను రూపమే కనబడుచున్నది. చేదాద్యర్థనాంతమైన అని ఉండుటచే