పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

నకు, గ్రామమునకు అనుటకు గ్రామానకు, శాశ్వతమునకు అనుటకు శాశ్వతానకు అనురూపము లేర్పడును. కైఫీయతులలో నకారమునందలి అకారము లోపించుటచే నేర్పడిన దేశాన్కు, గ్రామాన్కు, శాశ్వతాన్కు అనురూపములు కనపడుచున్నవి. గ్రామానికి, దేశానికి వంటినికి సహితరూపములు కూడనున్నవి. పయికి, వారికి అనుశబ్దములలో కూడ ఉపోత్తమేత్వమునకు లోపము కలిగిన పయ్కి, వార్కి అనురూపములు కన్పట్టుచున్నవి. ఇప్పటికి, అప్పటిలో అనుశబ్దము లందు 'టి' యందలి ఇ కారము లోపించుటచే నేర్పడిన యిప్పట్కి, అప్పట్లో అనురూపములు వాడబడినవి. వారలకు అనుచోట పడమరలోవలె రెండవ అక్షరము నందలి అకారము లోపించుటచే వార్లకు అనురూప మేర్పడినది. యీయ్నకు అనురూపము కూడ నిట్టిదే. భజంత్రీలకు బ్రాంహ్మలకు, నియోగులకు అను శబ్దములందు లకారమునందలి అకారమునకు లోపము కానవచ్చుచున్నది. ఈ విధముగ భజంత్రీల్కు, బ్రాంహ్మల్కు, నియోగుల్కు అనురూపము లేర్పడినవి. జరుగగలందులకు అనుదానికి జర్గిగలంద్లుకు అను రూపము వాడబడినది. ఇచ్చట అకారము లోపించిన లకారము దకారముతో సంక్లిష్టమైనది. జరుగు అను ధాతువునందలి మధ్యమ ఉకారము లోపింపగా జర్గ కావలయును కాని జర్గగల అనుటకు జర్గిగల అను రూపము వాడబడినది. ఇట్టి లోపములు సంస్కృతశబ్దములందు కూడ గోచరించుచున్నవి. కేశవ అనుటకు కేశ్వ, అనేక అనుటకు అన్కె, కర్ణాటక అనుటకు కర్ణాట్క, అంగారక అనుటకు అంగార్క, పురాతన అనుటకు పురాత్న, యోచన అనుటకు యోచ్న అను రూపములు ఉపోత్తమమైన అచ్చు లోపింపగా నేర్పడినట్టివి. చేయుటకు అను పదమునకు చేయడాన్కు, చేయాడాన్కి అను రూపములు వాడబడినవి.

క్రియాపదములు

వర్తమానకాలమునందు కలుగు చు వర్ణకమునకు బదులు తు వర్ణకము కన్పడు చున్నది. అగపడుతున్నది. చెప్పుతున్నారు, జర్గుతున్నది మున్నగున విందు కుదాహరణములు. కొన్నిచోట్ల కార్యము యొక్క అవిచ్ఛన్నతను తెలుపుటకు జర్గుతు వున్నది. జరుగుతూ ఉన్నది మున్నగు రూపములు కూడ వాడబడినవి. భూతకాలమున ఎ అను ప్రత్యయము చేర్పగా వచ్చిన రూపములను, భూతకాలక్రియాజన్యవిశేషణములకు చేర్చు తచ్ఛబ్దముల వకారమునకు లోపము వచ్చిన రూపములును కానవచ్చుచున్నవి. చేశెను; ఇప్పించ్చినాడు; ఏర్పరచినారు; తవ్వించినాడు మున్నగు రూపము లిందుకు తార్కాణములు. కొన్నిచోట్ల చేసెను, ఇచ్చెను అను క్రియల యందలి చివరి ఉకారమునకు దీర్ఘము వచ్చుటయు కానవచ్చుచున్నది. చేశెనూ; యిచ్చెనూ అగు ధాతువునకు భూతకాలమున ప్రథమపురుషైకవచనరూపము ఆయెను. ఒకచోట చాయడాయను అనురూపము కానవచ్చుచున్నది. ఇందు ఎను అనుగా మారినది. చేయడాయెను అనునది ఇందుకు సరియైన రూపము అయినది అనుటకు అయ్యింది అనురూపము వాడబడినది. ఆత్మనేపదార్ధమును సూచించుటకు ధాతువులకు కాను ధాతువు అనుప్రయుక్త మగును. "ఉత్తరస్యకానోర్ధాతోః కంబుధాః కేచిదూచిరే" అనికొని అనుదానికి బదులు క అనురూపము వచ్చుటకు పూర్వవ్యాకర్తలే అంగీకరించినారు. 'కొని’ బదులు కుని, కు అనునవి వచ్చిన రూపములు కూడ కానవచ్చుచున్నవి. చేస్కుని, పుండ్డుకుంన్న, కలుసుకొని, కూర్చుకుని పంచుకునె యెడల మున్నగున విందు కుదాహరణములు. భవిష్యత్