పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రామ కై ఫియత్తులు

66


32 కార్యాలపొలంలో తూపలు ౧౨॥ గరికిపూడి పొలంలో తూపలు ౧౨॥ సదాశివరాయలు చేశిన గ్రామాదులు నుదురుపాటిపొలం దేగడగడ్డపొలం వేమవరపు పొలం యీమూడు పూర్లు పొలం ౭౫ పొలిమేర హద్దులు చేసి ముడుంబ అయ్యవార్ల గారికి ఖండ్రికె యిచ్చిరి. గ్రామం కట్టించెను. ఈఖండ్రికె గ్రామం ఆయను. వంకాయలపాటి పొలం తూపలు ౩౩౹౹౦ పొలం ౧౦౦ తూపల పొలం బాణాదార్లకు యినాం యిచ్చిరి గనుకను యీబాణాదార్లు కాశీ విశ్వేశ్వరుని పేరిట పాలెం కట్టి హద్దులు పొలిమేరలు చేశిరి గనుకను విశ్వనాధుని ఖండ్రికె అనిరి. తుర్కల యేలుబడి పాటిబండ్లపొలంలో పాలెములు రెండు కట్టుకొని కాపురాలు వుండి పొలిమేర హద్దులు చేశి జూలాల్పరం, ముస్సాపురం అనే గ్రామాదులు ఆయను. ఆమీనుబాదా యాంబలూరి పొలంలోనిది అల్లిపురం వెదపణిదంపు పొలంలోది. జటాలుఖానుని పొలంలోది దర్యాపురం అనిరి. వుత్తరగంగవరం అనే గ్రామం యక్కాట పులిపాక అనే గ్రామం జెబతుపురం అయ్యెను. ములుకుట్ల అనే గ్రామం యస్సాపురం ఆయను. యీకొండవీటిశీమ గ్రామాదులు హవేలీ గ్రామాదులలోను యీవెన్కను వీరు చేశ్ని గ్రామాదులు కాకనుమున్కు పూర్వపు గ్రామాదులు ౬౦౦ యివి శీమామూలం అయినద్ది. కొండవీటికి మాణిక్యారావు, వచ్చిన సంవత్సరం...శ్రీవీరి యింటిపేరు కృష్ణానది వారందురు. వీరు వోరుగంటి దుర్గానికి నాయకులయిన తర్వాతను యీకృష్ణానికొండన్న అని అతన్కి సంతతి లేదు యితని తంమ్ముని కుమారుడు చిన్నవాడు యీచిన్నవాణ్ణి వెంట పెట్టుకొని యీకొండన్న ఖుదాహుశాదశ౯నానకు వచ్చెను. గనుకను ఖుదాహుశాన్కు కొమాళ్లు లేరు గన్కును యీచింన్నవాణ్ణి చూచి చాలా దయవచ్చి మాటలు మాణిక్కాలు యీచిన్న వాని వనిదయివచ్చి మాణిక్యారాయుడు అనీ పేరు యిచ్చి యితన్కి కొయ్యల కొండదుర్గానికి నాయకరానికిని ధరణిని చేసె గనుకను కొయ్యలకొండలో యితని మన్వంతరం వుండిరి. యితని కొమారుని మన్వంతరానను విధురాముని నమామోనునకొయ్యల కొండ విడిపించి కొండపల్లి దుర్గాన్ని నాయకరం అంపించ్చిరి. యీ కొండపల్లిలోను కొంన్ని దినములు జరిగిన తదనంతర మందునను కొండవీడు కొండపల్లెలు తుర్కాణ్యం అయ్ని తర్వాతను కొండపల్లె నుంచి కొండపల్లి నాయకరానకు వచ్చిరి. వీరు వచ్చి సంవత్సరము స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశకవరుషంబులు ౧౫౦౭ అగు నేటి తారకనామ సంవత్సర అశ్వీజ శుద్ధ ౧౦ గురువారం ముంమ్మన్న మాణిక్యారాయడు ప్రవేశము యీయన బాల్యనామము ముంమ్మన్న అని నామాంకితము గనుకను ముంమ్మన్న మాణిక్యారాయుడు అనిరి. యాదాస్తు మానూరువారు వచ్చిన సంవ్వత్సరములు మానూరివారు మజుము వప్పుకొని తురకాణ్యం అయిన ౧౩ సంవ్వత్సరములకు వచ్చిరి. వీరు వచ్చిన సంవ్వత్సరం స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వర్షంబులు ౧౫౧౫ అగునేటి నందన సంవత్సరమున వచ్చినారు. ఇక్కడికి పొదిలెశీమ స్తలకరణం పోలంరాజు పెద అన్నంరాజు వుద్యోగ ధర్మం చాతను వుండి వాశిన ప్రకారము పొలిమేరతొక్కగలందులకు విజ్ఞానేశ్వర వచనంతెనుగు పద్యము.

గ్రామంబు పొలిమేర కరయు చెనిలు పట్టి
కాలాంతరంబున కలశెనేని
విధువిధుల గొల్లల వేటకొండ్రను వొంత
చేవికలువెవుడి శేయువారి