పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

65


తుముళ్ళగుంట యీమూడున్ను పెదతక్కిళ్ళపాడు సమేతు 3 న్ను దేచవరం వుత్తర పోణుకుపాడు పడ్మట మంగళగిరి యీ న్ను పెదకొండూరి సమేతు ౩ దక్షిణం కొంపల్లె అల్యూరం సమేతు శానంపూడి, మందపాటి సమేతు ౧, వుత్తర తుర్లపాడు వరగాని సమేతు ౧, వుత్తర రంగవరం కుంట, పెదకూరపాడు సమేతు ౨ రామాపురం అంతలూరు సమేతు కాశిపాడు దిడుగు సమేతు ౧, వుత్తర పొట్టాపురం, పుత్తర కోపల్లె పడ్మటి ఒకేపల్లె సమేతు 3 తింమ్మాపురం, అప్పాపురం, మోచళ్ళపల్లి, నాడెండ్ల సమేతు ౪ అగతవరం, పెదకాకాని ౧, బుడమ, కొరివేడు, గరికిపాడు ఈమూడున్ను గుంటూరు సమేతు బోడపాడు పోతుకట్ల కుంకలమర్రు సమేతు యక్కటల వుప్పవరపాడు సమేతు పినపాడు పెద కూరపాడు సమేతు ౨ పడమట మున్నంగి కాజ సమేతు ౨ అలరాల యాదలి సమేతు ౧, రోకుంటిగుండ్ల శిద్దాపురం మెట్టపల్లి అనంతవరం పినపాడు, పెదపాడు యీ ౬ గ్రామాదులు గజరాయని వేల్పూరి సమేతు అయ్యవరం కంచెర్ల కరెవరం సమేతు ౨ యివి దాఖలా యీవుండెలనాటి మాటలు ఖండవీలు అనంగ్గాను కుచ్చళ్లు అనుట ఖండవీలు ౨ అయితేను కైలుకుచ్చెల అందుకు కుంటలు ౪౦౦ అయితేను కుచ్చల. యీకుచ్చెళ్ల పేరు పూర్వకత్తెర యందురు. యీన్నూరు కుచ్చళ్ల పేరు మర్తుక అందురు. యీవెన్కున పొండినలనూరు కుంటల కుచ్చల పేరు ఖండవీలు అందురు. యీవెన్కును ౮౦ కుంటలకు కుచ్చెలపేరు ఖండలి అందురు. ఖండ్రవాటు అనంగ్గాను గ్రామంలో తునకు ఖండెమనంగ్గాను బారలో సఖముఖండి అనంగాను పుట్టెడు అనుట, మారద అనంగాను కుచ్చల అందురు. తూపకుచ్చెల ౨౹౹ సంఖ్య కుచ్చడ్లు యిన్ని సంఖ్యలు అయ్ని పదహారు పురనాలుగు బారలుఘటకర్తి అంన్నాను, మర్తువు అంన్నాను, తూపలు అంన్నాను. చింన్నపాటి పెద్దపాటి విచారించుకునేది. జాగీర్లు యిచ్చినాడు దక్షిణం యీపూరు ౧ కుక్కలమర్రు చోడపాడు ౧ , యీనాల్గు గ్రామాదుల్కు వుప్పుటూరు అయిల్లాఖానునికి ౧౨౦౦౦ వేలవరహాల్కు జాగీరు యిచ్చిరి గనుకను యీగ్రామాదులు వుప్పుటూరి కిందను కల్సిపోయను. యీ అబ్దుల్లాఖానివారు ఉప్పురువ యీగజపతివారు అలాయిదా పొలిమేర హద్దులు నిల్పి గ్రామాదులు చేశిరి. పైటేటిపొలంలో పాలెం రేపూడి ౧, చినకూరపాటి ముప్పాలపూడి ౧ యీపనిపొలంలో పాలెం దుగ్గిరేలపూడి ౦, చేబ్రోలు వడ్లపూడి పొలం పెనుగుదురుపాటి పొలం కల్పివడ్లపూడి పొలంలో పాలెం శ్రీరంగపురం యీనాల్గు గ్రామాదులు జగపతివారు చేశినవే. రెడ్ల వారు చేసిన గ్రామాదులు సొలస పొలంలో పాలెం సంక్రాంతిపాడు అయిలవరం ౨ యీగ్రామాదులు రెడ్ల వారు పొలిమేర హద్దులు చేశిరి.కృష్ణదేవరాయలు వ్రాసిన గ్రామాదులు :—వెంన్నాదేవి పొలంలోను పాలెములు ౨ కి పొలిమేర హద్దులు చేశ్ని గ్రామాదులు భట్టుపాడు అనేగ్రామం కంకణాలపల్లి అనిరి పొంన్నకంట్టి పొలంలో పాలెం పోలిమేర హద్దులు చేశి ఖండికి చేశి పొంన్నగంటి గోపినాధునకు యిచ్చెను.పొంన్నకంటి ఖండికె అనిరి. యీమూడు గ్రామాదులు కృష్ణదేవరాయలు పొలిమేరనిల్పి గ్రామాలు చేశెను. తరువాత జటామాలి మగరాజు అత్తోట పొలంలో పాలెం హద్దులు నిల్పి కంచవరం వూరు ఆయను. యీవని అత్తోట యీరెండు ఊళ్ల పొలం కల్పి గ్రామం చేశిరి తుర్కాజ్యం అయిన వెన్కును తాళ్లూరి పోలంలోను తూపలు ౫ం ఖండ్రికె చేశి శ్రీరంగపురం అని గ్రామం కట్టించి పొలిమేర హద్దులు నిల్ఫిరి. యడ్లపాటి పొలంలో తూపలు ౧౦౦ ఇతర పొలిమేర హద్దులు చేశి విశ్వనాధుని ఖండ్రికె అని నామం గనుకను చేశాను. గ్రామాదులు యెడ్లపాఖ పొలంలో తూపలు