పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

63


లింగరాజు అనే అతన్కి.... రాజనాపురపు వారని తరిగొప్పల వారు అందురు. యీతరిగొప్పల విశ్వపతి అనే అతడు యీఆరాధ్యుల లింగరాజుకు క్రయం గ 3 ౨ వరహాల్కు అంమ్ముకొని వీరు యిద్దరు దేశాంతరులయిరి. వీరిని కౌండిన్య గోత్రులు కంత్తేరు వెలనాడు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరిని యద్దనపూడివారు అందురు. యీవెంకన అనే అతడు రామకూరి రఘుపతి అనే అతన్కి ౯౦ వరహాలకు అమ్ముకొని పోయెను. ఇవి పూర్వక్రయాలు యీగ్రామాదులు రౌద్రి సప్తక ప్రభవ పంచక క్షామానకు అంమ్ముకొని దేశాంతరులు అయిపోయిరి. అర్ధ జీవనం గల వారు పోలేదు. వీరిని యాద్వాదశాబ్దాలు పట్టలుకొట్టి ధర వక్కరీతున అంమ్మినది గనుక జీవంతులు అయివుండిరి దేశాంతరులు అయిపోయి తిరిగివచ్చి జల్లిగంపవారు ప్రధములు భారద్వాజ గోత్రులు యలమందలో సంప్రతులు సంమ్మెహిని వీసంక్రయ లబ్దంకు కొనుక్కొని కుదురు కొనిరి. మంచికంటివారు నల్లపాటిలోను సంప్రతులు 3 లో వీసంమ్నువాని క్రయానకు కొనిరి. కొరితపూడివారు అనేటివార్కి సంముక్కా విక్రయాలు కొనిరి. మేడికొండూరులోని హ్రింసంసంమ్నొవాని క్రయానకు కొనిరి. పడివీసాలు గౌతమ గోత్రులయిన యాంబలూరి వారు పదివీసాలు అవిరి ప్రత్తివాడు కరిణీకం యోలూరి వారు అనేటివారు పరకనం మ్నోవాని కొనిరి. (అక్కడ మాతృభిన్నం) హస్తకులను నిల్పి పోయిరి. కొన్ని వూండ్లవాండ్లు కామరాజుగడ్డ బాట్రగడ్డ రుద్రవరాలకు విశ్వాత్ములవారు లింగధారులు గనుకను తమశీఘ్యలయిన భారద్వాజ గోత్రులకు హస్తకంవుంచిపోయిరి. మోదుకూరి అర్వలు వశిష్ట గోత్రులను వుంచిపోయిరి. కెల్లిమర్ల నియ్యోగులను వుంచిపోయిరి. అంగ్గలకుదురు తమ బంధువులను పినపాటి వారు గౌతమ గోత్రులుకు మంచిరాజు వారు అందురు. పెనుగుదురుపాడు రాచవారి వెంబడి వచ్చిన బాంహ్మణులు దేశాంతరులు అయిరి గనుకను భారద్వాజ గోత్రులు నియ్యోగులు ఆక్రమించి వీరు వెలనాడు పెనుపులిశెనల వారిని హస్తకం వుంచిపోయిరి. వీరు నియ్యోగులు వెలనాడు పెదకొండూరు బ్రాహ్మణులు కంభంమెట్టవారు ముచ్చికంటివారు అనే వారిని వుంచిరి. పెడపర్రు కొల్లిపరవారిన వుంచిపోయిరి. పెదరావూరు సాయింఖాయినస గోత్రులు ప్రధములను వుంచిరి. పెదపూడి బ్రాహ్మణుల అమృతలూరి కరణం మౌద్గల్య గోత్రులను నందవరీకుంణ్ణి వుంచి ధరణికోటవారు ప్రధములు గౌతమ గోత్రులు అత్తోటవారు అనేటివారిని వుంచిరి. వీరిని నడిమిపల్లి గూడవల్లులు నియోగినివుంచిరి. వీరిని నడిమిపల్లి పేర్తున పోయిరి. యీరీతున ఉంచి దేశాంతరులు అయిపోయింది. గనుకను లూనియోగ్యులు కొన్ని ఊళ్ళను తామే ఆక్రమణచేశిరి. కొన్ని పూళ్లవారువచ్చి యీవణ స్తకులను వెళ్లదోలిరి. బండారుపల్లి వాస్తుకలు వీరు ఆక్రమించిరి. చిలుకూరి అంమ్మ రాజువారు అనేటివారు ప్రభవ సంచక సప్తకాల్కు హస్తకులను వుంచి దేశాంతరులు అయినారు. స్వస్తిశ్రీ విజయాభ్యుదయశాలి వాహన శరవరుషంబులు ౧౫౦౦ మీదట ప్రమాదినామ సంవత్సర చైత్రశు ౫ అంగారకవారం ఝాముపొద్దుయెక్కినవేళ కొండవీటి దుర్గం పోయివుంచి అశ్వపతులు తీస్కునిరి తురకల యేలుబడి ఆయను. కొండవీడు కొండపల్లులు ముర్తుజాంనగరు ముస్తుభాంనగరు అనిరి. యీరెండు సర్కారులు అశ్వపతులు బేరీజుచేసే గనుకనుమూర్తుజాంనగరు శిస్తుయొక్క ముస్తుభాంనగరు శిస్తు తక్కువ అయగనుకను రావిపూడితో కూడ పధ్నాల్గు మాండ్లశిస్తు ...ముస్తఫాంనగరులో కల్పిరి గనుకను యీ రెండు సర్కారుల శిస్తు సమం చేశి రాయిపూడి అలాయిదావిలాయితీ అనిరి. పాములపాడు ౧,