పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

గ్రామ కై ఫియత్తులు


తమకు పంచుకొనిరి. లగడపాడు కేతనవారికి ఏక సంప్రతిగను తమబంధువులు ఆలూరి రంగయ అనే అతనికి ౮౦ అమ్ముకొనిరి. చినమక్కెన తమది ఏక సంప్రతి గనుక గొరిశెవోలు రంగరాజు అనే ప్రధమున్ని క్రయం ౮౦ వరహాలకు అంమ్ముకొని యీ కేతరాజు ప్రభాకర మల్లయ్య యిద్దరు కొణిదెంబాక నారపరాజు ఆపెదముక్కెన యీ చింతలపూడింన్ని ౨ న్ను తమకు యేక సంప్రతి గనుకను కౌండిన్య గోత్రుడైన కాటూరి మంత్రరాజ్కు అంమ్మి పెదమక్కెన ౮౦ అతడు వీరు కలసి దేశాంతరులు అయిరి. దిడుగు తుమ్మవరాలు ౨ న్ను భారద్వాజ గోత్రులు బొమ్మకంటి వారు పాతికే సంఖ్యాయనస గోత్రులయిన మాదిరాజువారు పాతికే, కౌశిక గోత్రులయ్ని కటకూరివారు పాతికె, ధూళిమెడ్డవారు గౌతమ గోత్రులు పాతికె యీనాలుగు తెగలవారు వెలనాడు వీరు అనుభవిస్తూవుండి తదనంతరమందునను యీరౌద్రి సప్తకమందు నిర్వహించలేక తడుగుతంమ్మవరాలున్ను యీ కటుకూరి వారున్ను ధూళిమెట్ట అన్నంరాజు వారు తమ భాగము ౨ రెండు పాతికెలున్ను అంమ్ముకొని పోవలెనని విచారించి వీరు అంమ్ముకున్న లక్షణం- మోరెంపూడి వఝులు అనే అతడు శ్రీవత్స గోత్రులు వెలనాడు నియ్యోగి, క్రయం చేశిరి గనుకను కనుబొమ్మకంటి సుందరయ అనే అతడు తాను సంప్రతి భాగస్థుణ్ణి వుండిపరాయిల్కు అంమ్మనియ్యను అని వారు వఝులతో చేశిన క్రయం తంమ్మవరం రెండు తెగల వారు రెండు పాతికెలు క్త్రయం ౫౦ బొమ్మకంటి సుందరయకొనెను. దిగుడు పాతికెలు ౨ న్ను సాయింఖాయినస గోత్రుడైన మాదిరాజు కృష్ణంరాజు కొనెను. క్రయం ౮౦ వరహాలు. యీరెండు గ్రామాదులు క్రయం ౧౩౦ వరహాలకు కటుకూరి నాగయ్య ధూళిమెట్ట అన్నంరాజు దిడుగు తంమ్మవరాలు తమిమిరాశి అమ్ముకొనిరి. కాశిపాడు ప్రధములు భారద్వాజ గోత్రులు వీరిని రాచనాల వారు అందురు. యీ రాచనాల వెంకన్న అనే అతడు యీ సాయింఖాయినస గోత్రుడైన మాదిరాజు కష్టంరాజుకు ౬౦ వరహాల్కు అంమ్ముకొని దేశాంతరులు అయిపోయిరి. కటుకూరి నాగయ ధూళిమెట్ట అన్నంరాజు రాజనాల వెంకన్న యీ ముగ్గురు దేశాంతరులయి ఓరుగల్లు కాశ్యప గోత్రులు వెలనాడు వీరిని యద్దనపూడి వారు అందురు. యీ యద్దనపూడి గోపరాజు అంమ్ము కొనెను. ఆంబటిపూడి కరణం నందవరీకులు భారద్వాజ గోత్రులైన గోపాలుని బాపిరాజు అనే అతనికి క్రయం ౫౦ వరహాల్కు అంమ్ముకొని యద్దపూడి గోపరాజు దేశాంతకుడు అయెను. ఆ గోపాలుని బాపిరాజు తనకు స్నేహితుడని ప్రధముడు అయ్ని దీవిలక్ష్మయ్య అనే అతణ్ణి ఆచోరు గంటికి హస్తగతం వుంచెను ....ంగల్లు ఏక సంప్రతి ప్రధములు యీ గోపాలుని బాపిరాజుకు సగం సంప్రతి ౪ం నలుభై వరహాలకు అమ్ముకొని దేశాంతరులు ఆయెను. యీ ధరణికోట పొలంలోది అమరేశ్వరం ప్రభవ పంచకమందు యీ ధరణికోట బ్రాహ్మణులు అగ్రహారాల్కు తూపలు ౧౬౪ పోయి హద్దుచేశి అమరేశ్వరం ప్రధములు గౌతమ గోత్రులు ఆత్తోట వారు అనేటివారికి గ ౬౦ ఆరువయి వరహాల్కు అమ్ముకొని ఆత్తొటవార్కి యీ ధరణికోటకు హస్తకంలివుంచి ధరణి కోట బ్రాహ్మణులు దేశాంతరులు అయిరి, కొల్లిపర కొండపాటి శరభరాజు అతన్కి గౌతమ గోత్రుడు బుద్ధవరపు వేలనాడు సంప్రతి ౧ వీరిని తోరణాలవారు అందురు గౌతమ గోత్రులు తోరణా తింమ్మరాజు యీబొండ పాట శరభరాజు అని అతన్కి .... బుద్దవరం ౪ం వరహాలకు అమ్ముకొనెను. రాజనాల పురం వెలనాడు కౌశిక గోత్రులు సంప్రతి ౧ కొల్లిపర కౌండిన్య గోత్రులు వీరిని ఆరాధ్యుల