పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

61


మలవారు అందురు. బుండపాటివారికి బంధువుడై వుండి వచ్చే గనుకను యీకొల్లిపర బొండపాటి వారు గౌతమ గోత్రులు వీరి యింట్లో చిన్నదాన్ని యీముక్కామంగ్యయ అని వారిని యిచ్చి వివాహంచేశి తమ భాగంలోను పరక కరిణికం యిచ్చెను. బొడపాటి వెంగన అనే అతడు కొల్కలూరు కౌండిన్య గోత్రుడైన గోపరాజు గోపయ అనే ఆతన్కి మేనల్లుడైన భరితేపూడి కొండయ అనే అతనికి కాశ్యప గోత్రుడు వీనికి యీ గోపయ కుమార్తెను యిచ్చి వివాహంచేసి. వీసకరిణీకం తన భాగంలోను యిచ్చెను. మోదుకూరు అర్వ లు హస్తకులయ్నివారు వసిష్ఠ గోత్రులు వీరిని అడిదెవీటి వారు అందురు. తెలగాణ్యులు యీ అడిదెవీటిశిట్లయ అనే అతడు తన మేనల్లుడైన విశ్వామిత్ర గోత్రుడైన మాదగుంట గుర్వయ అనే అతనికి చింన్నదాన్ని యిచ్చి వీసం తనభాగంలోను యిచ్చెను. కౌండిన్య గోత్రుడైన కాటూరు మంత్రయ కొన్న నందిగామ పెదమక్కెన చింతలపూడి యీ మూడు గ్రామాదులలోను యీ మంత్ర రాజు నర్సయ్య అనే అతడు భారద్వాజ గోత్రుడైన మరిగెనపూడి అక్కయ అనే అతనికి తన కుమార్తెను యిచ్చి వివాహం చేశి యీ మూడు గ్రామాదులలోను తన యాకభాగంలోను పాతికె యిచ్చి ముప్పాతికే చేసుకొనెను. నుర్రతారు వెలనాడు భారద్వాజ గోత్రులను సంప్రతి ౧ వీరిని బంధువులు యితన్కి మేనల్లుడు సాయిఖానుడు గోత్రుడైన మాదిరాజు యీ గంగరాజు కుమార్తెను సాయింఖానస గోత్రుడైన బాపయ అనే అతన్కి యిచ్చి పాతికే తన యాక భాగంలోను యిచ్చెను. నారాయణపురం బేతపూడిలో యీ రెండు గ్రామాదులు పాకనాడు బల్లికుర్వపాడు అందరు యీబల్లి కుర్వయ దివాకరుని కుమార్తె చుట్టకాండ్లతో జగడం పుండ గాను చిన్నదానికి వివాహంగాక వుండగాను నాదెండ్ల అన్నా పెగడవారు శఠమర్షణ గోత్రులు యీ అన్నా పెగడ వెంకన్న అనే అతనికియిచ్చి వివాహంచేశి తన యేక భాగమయిన నారాయణపురం బేతపూండ్లలోను పరామిరాశి యిచెను. (యిక్కడను మాతృ భిన్నం) కొర్రపాడు సంప్రతులు ౨కి పాకనాడు శ్రీవత్స గోత్రులు శివదేవుని వారి సంప్రతి యిచ్చి ప్రథములునే తనవారు అనేటివారు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ న్ని యీ కేతన ప్రభాకరయ అనే అతడు యీమంత్రరాజు అనే అతడు నందిగామ, భీమవరం చిలుకూరుకొనెగన్కను యీ మంత్రి రాజుకు ఆరూరి తనభాగం అమ్మజూపె గనుకను శివదేవుని త్రిపురయ అనే భాగస్థుడు నేను సంప్రతిని వుండి పరాయికి నేను యియ్యను అని తన బంధువుడు కంటెపూడికరిణీకం దొడ్డవాడు బల్లికత్వ తిమ్మరాజు ఆత్రిపురరాజు విచారించి అకొర్రపాటి కేతనవారి సంప్రతి ౮౦ వరహాలకు క్రయం పుచ్చుకొని యీ తిమ్మరాజు సమత్రిపుర రాజ్కు సగం సంప్రతి పుచ్చుకొనిరి. సామతారమల్లపరాజు అని అతడు భారద్వాజ గోత్రుడు త్రిపురరాజుకు బంధువుడు గనుకను త్రిపురరాజు తనుకొంన్న సంప్రతి అర్థం పాతికెగ ౨౦ వరహాలకు ఆసాంతలూరి మల్లపరాజుకు యిచ్చెను. యీ బల్లికుర్వ తింమ్మరాజు తాను పుచ్చుకొన్న సగం సంప్రతి ఆ సాతులూరి మల్లయ్యకు యిరవై వరహాలకు యిచ్చి కట్టెంపూడికి చెర్వు వేయించెను. యీ కొర్రపాటికి శివదేవుని త్రిపురయ సంప్రతి పాతికె, సాతులూరు మల్లపరాజు ఆర్థసంపంతి యీ బల్లి కుర్వతిమ్మరాజు పాతికె కౌర్రపాడు తనవారి సంప్రతి యీరీతున క్రయానకు అంమ్ముకొనిరి యీ ప్రభాకరయ తనజ్ఞాతి మల్లయ్య అనేఅతణ్ణి కలుపుకొని పెదపణిదెరపు సంప్రతి చిట్లూరి కరణం భారద్వాజ గోత్రుడు తమకు బంధవుడు గనుకను కొండ చినమక్కెన తనకు అనే ప్రధమున్కి తన సంప్రతిలోను ముప్పాతికె భాగం ౬. వరహాలకు అంమ్మి పాతికె భాగం