పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

గ్రామ కైఫియత్తులు


అంబటిపూడి కరణాలు పాలుని వారు పోయిరి. పెరవలి కొల్లివారు అనే వెలనాటినియ్యోగులను వుంచిపోయిరి. చినపులివర్తిపాడు భట్టిప్రోలు కరణాలను వుంచిపోయిరి. గోరంట బ్రాహ్మణులు కట్టమూరి నియ్యోగులు వెలనాటి వారికి వుంచిపోయిరి. అమృతలూరిలో హరితస గోత్రులయిన పులిపాక వారి సంప్రతిలోను కాళ్ల వెంకన్న కొమరై చింన్నగావుండగాను యీ కాళ్ల వెంకంన్న పాంశ్విఖ వరపకరణం ఆత్రేయ గోత్రుడు అడ్డపుడవారు అందురు. యీ అడ్డగడవల్ల వెంకనన్న అనే అతన్కి యిచ్చి వివాహంచేశి పులిపాక కాళ్ళ వెంకన్న తన కరణీకంలోను పర్కధార పోశెను. చిన్నపలకలూరిలోను శౌండిన్య గోత్రుడు వీరిని పట్టస్వామివారందురు. యీ పట్టస్వామిన్ని అన్నంరాజుత్న మేనల్లుడు మాస్నగంటి రామయ్య అనే అతన్కి తన కొమార్తెను యిచ్చి వివాహం చేశి యాక సంప్రతిలోను కరిణీకం ధారపోశెను. వీరు ప్రధములు భట్టిప్రోలు కౌండిన్య గోత్రులు మెడుకొండూరు కరణం వెలనాడు భారద్వాజ గోత్రులు వీర్ని భయిరవరాజు వారందురు. వీరినే కొమ్మరాజు వారు అందురు. వీరిని మేడి కొండవారుఅందురు. యీ భయిరవరాజుశరభయ్య అనే అతడు యీభట్టిప్రోలులో పాటం చిన్నంరాజు అనే అతణ్ణి మేనల్లుడు గనుకను తన కుమార్తెను యిచ్చి వివాహంచేశి తన భాగం లోను పర్కభాగం ధారపోశెను. పూసపాటివారి సంప్రతిలోను క్రయం అమ్ముకొనిరి. కౌండిన్య గోత్రులకు చిన్నదాన్ని యిచ్చి వీసందహయిత్రం యిచ్చిరి. నల్లూరి వెలనాడు కౌశిక గోత్రులు వీరిని రుద్రపోలిన వారందురు. యీ రుద్రదేవుని సంగరాజు అనే అతడు పూసపాటివారు వెలనాటినియ్యోగుల. . . గెనారాయణ అనే అతన్కి తన కుమార్తెను యిచ్చి యీ నల్లూరితో తన కరిణికంలో పర్కధారపోశెను. చిల్కూరు నందిగ్రామ పెదమక్కెన చింతలపూడి యీ నాలుగు గ్రామాదులలోను మంత్రియరాజు నర్సయ అనే అతడు భారద్వాజ మంగ్గినపూడి అక్కయ్య అనే అతన్కి యీ నర్సయ్య - కుమార్తెను యిచ్చి వివాహంచేశి మంత్రయ కొన్ని క్రయం యాకభోగంలోను పాతికె భాగం యీనల్గు గ్రామాదులలోను యిచ్చెను. ముప్పాతిక భాగం తాను వుంచుకొనెను. సాతులూరు కరిణీకం భారద్వాజ గోత్రుడు దత్తిమల్లయ అనే అతడు తన కుమార్తెను ఆత్రేయ గోత్రుడైన చిలుపూరి కరణం కొంమ్మరాజు పొట్టలింగ్గరాజు వివాహంచేశి తన సంప్రతిలోను యీ లింగరాజుకు పరకరణీకం యిచ్చెను. పరిలెపూడి భార ద్వాజ గోత్రుడైన శానంరాజు అనే అతడు తన కుమార్తెను కాశ్యప గోత్రుడైన మత్కుపల్లి వెంక్కటయ అనే ఆతనికిచ్చి వివాహంచేయించి పర్మకరణికం యిచ్చెను. చినపులివర్రు ప్రతి కరిణికం తెలగాణ్యులు హరితస గోత్రులు వీరిని వేంగ్గివారు అందురు. యీవేంగ్గిరంగయ అనే అతన్కి కుమార్తె మరుగుజ్జురు అని యెవ్వరు బంధువులును పుచ్చుకొకను వుండిరి. గనుకను పెరకలపూడి కరణం వెలనాడు భారద్వాజ గోత్రులు వీరిని మల్లినాధుని వారు అందురు. అనే ఆతనికి చింన్నదాన్ని వివాహంచేశి తన సంప్రతి భాగంలోను పాతికే కరిణికం చినపులిపర్రు యిచ్చెను. యీ వనిపాకనాడు శాండిల్య గోత్రులు వీరిని బల్లి కుర్వవారు అందురు. యీ బల్లికుర్వ బాచయ అనే అతడు తను కుమార్తెను నోచళ్ళపల్లి నాగరాజు అని అతడు కౌండిన్య గోత్రుడు యీచింన్న దాన్ని ఆ నాగరాజుకు వివాహంచేశి యీ పనిలోను తన సంప్రతి భాగంలోను ఆ బాచయకు వీసంకరిణీకం యిచ్చెను. తాను వుద్యోగ ధర్మం చేతను పలనాడు పోయినాడు. యిది పర్యంతం మన్ను సంప్పటం కోనప్ప వాశిన ప్రకారం కొల్లి పరలోను కృష్ణానది తూర్పునుంచి వెలనాడు కాశ్యప గోత్రుడు వీరిని ముక్కా