పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

55


వేయించెను. గొడవర్రు అనే గ్రామం అంన్నరామభొట్లుగారికి పొన్నగంటి గోపీనాధుడు అని అతనికి వంకపల్లి వారు అనేటివారికి యీ మూడు తెగల వారికి యిచ్చెను. పొన్నిగంటి పొలం లోను పాలెంపొలిమేరహద్దులు పెట్టించ్చి పొంన్నగంటి గోపీనాధునికి యిచ్చెను. ఖండ్రికె తూర్పు శ్రీరంగపురం ఆరు యిండ్లవైష్ణవుల్కు యిచ్చెను. వెంన్నాదేవి పాలెములు ౨కి ఒక పాలెం నగరిలో గాజులు తొడిగేవాన్కి యిచ్చెను. గనుక అయిదావూరు అయను కంకణాపల్లి అనిరి. యీవేన్నాదేవి పాలెంలోను రెండు పాలెం పెంపు వచ్చి భట్టుకు యినాము యిచ్చి హద్దులు బెట్టించె గనుకను అలాయిదా గ్రామములు ఆయెను. భట్టుపాలెం అనే గ్రామం ఆయెను భట్రాజుకు యిచ్చెను. తూర్పు రుద్రవరం అనే గ్రామం జంగాలకు యిచ్చెను. జంగాలపల్లి అనే గ్రామం జంగాలకు యిచ్చెను. గజరాజుది వేలుపురం బోగందానికి యిచ్చెను. ఆబోగముది తనకు పొలము చాలదని అడిగెగనుకను ఆచుట్టున నీవు ఒకనాడు యెన్ని వూళ్లుపోయి పొలిమేరలు కలియతిరిగి వస్తుంన్నావో అంన్ని పూళ్లపొలం నీకు వేల్పూరు కిందను కల్పినడిపిస్తున్నారు అని కృష్ణ దేవరాయలు ఆనెగనుకను ఆబొగముది రోకంట్టికండ్ల శిద్దాపురం పెరిటపాడు అనంతవరం చినపాడు పెదపాడు అనే గామాదుల పొలం పొలిమేరలు ఒక్కనాడు తిరిగి సాయంకాలం అయ్యేటప్పటికీ వేలుపూరిలో నువచ్చి అప్పడే ఆభోగంది పరలోక యాత్ర చేశెను. దానివాండ్లు వేలుపూరు కిందను పాలెములు గాను యిచ్చెను .... యీకృష్ణ దేవరాయలు కొన్ని గ్రామాదుల్కు యజమాన పెత్తనం యిచ్చి వృత్తి క్షేత్రాలు గ్రామానకు వకటి రెండూ యీచొప్పున యిచ్చి గ్రామ పెత్తనం యిచ్చెను. వైదికులకు కొల్లిపర్ల పెత్తనం యిచ్చెను. మాచెర్లవారు అనేటివార్కీ మహకాళి ఆనేటివారికి మున్నంగి చేతన భొట్లువాయ అనేటివారికి యిచ్చెను. యీగనిసగరంవారు అనేది వార్కి యిచ్చెను. దంతలూరు పీసపాటివారు అనేటివారికి యిచ్చెను. కృష్ణానది దక్షిణం గొడవర్రు పిళ్లుపాటి అనేటివారికి యిచ్చెను. తోరిపిల్లలమర్రి వారు భాగవతులవారు నందలవారు అనేటివార్కి యిచ్చెను. నందివెల్లు కఠివరాలు రెండున్నూ పన్నాలవారు ఆనేటివారికిచ్చెను. మంచ్చాల శిష్టావారు అనేటివారికిచ్చెను. సుద్దపల్లి దంటువారు అనేటివారికిచ్చెను. జంపని వంగవేటివారు అనేటివారికి యిచ్చెను. పడమట జొన్నలగడ్డ పోత వరాలు అనే గ్రామాదులు రూపాకులవారు అనేటివారికి యిచ్చెను. వోలేరు వంగలవారు అనేటి వారికి యిచ్చెను. పెదపల్కలూరు బొండుపల్లివారు అనేటివారికి యిచ్చెను. దుగ్గిరాలపూడివారు పేరిటవారు అనేటివార్కి యిచ్చెను. నల్లూరు రామరాజుండ్డ కాపాడు గ్రామాదులు కొత్తపల్లి వారు అనేటివారికి యిచ్చెను. వెల్లటూరు తంగ్గిరేలవారు అనేటివారికియిచ్చెను. తాళ్లూరు గుండె పూడివారు అనేటివారికి యిచ్చెను. కొల్కలూరు అనేటిగ్రామం సూరావఝలరామంన్న, వాటులి లింగన్న, గోడాసర్పయ్య, కర్రా అచ్చన్న, గుల్లెపల్లి శింగయ్య, కొప్పిళ్ళ యర్రయ్య, పయిడి పాటిమల్లంన్న, శ్రీపాద తింమ్మన్న, మణులగూరివారు, అవ్వారివారు, వేదాంతంవారు, దచ్చెటి నారాయణ యీపన్నెండు తెగల వార్కి యిచ్చెను. యీరీతినను యజమాని పెత్తనం యిచ్చి వృత్తి క్షేత్రాలు యిచ్చెను గనుకను రెడ్లు యిచ్చిన ఆగ్రహారాలు కర్ణాటకం కిందను శీమలు నడువ వాయెను. గనుకను యీరెడ్లు యిచ్చిన అగ్రహారాలు ... పూండ్లవారు ౪౪ గ్రామాదులవారు మనకు అగ్రహారాలు నడువకపాయెను. మనంమే యజమానులమై వుండి వుంటిమనగ్రామాదుల్కు యజమాన పెత్తనానకు పరాయీలకు ఆంపసేమో మనము వుండి పరాయి పెత్తనం అయితే మనయజమానత్వం యేమని పోయిరాయల దర్శనంచేశిరి గనుకను రాయల దేవుడు మిరాశి