పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

గ్రామ కై ఫియత్తులు


యల్లయ అనే బంట్రౌతు దుర్గంలోకి యెక్కి రాంగాను ముత్యాలమ్మ గుండ్లు అని గుండ్ల మెట్ట దగ్గిరను పొడిచి చంపెను. అంతటతోను రెడ్లవంశం సరి పోయెను. శ్రీరాయలువారి యేలుబడి శ్రీరాయలు వారియింటి పేరు అందురు. శిలగోత్రులవారు అందురు. కృష్ణ దేవరాయులు రెడ్లుయేలిచన్న తదనంతరమందున రెడ్లవారు యేలిన శీమలు కర్ణాటకం కింద కల్పవలెను. వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, కొండవీడు, కొండపల్లెలు సాధించి వెయ్యవలెనని మనస్సునపూహించి వుపశ్రుతి దేవతను తలంచి రజకునిపదకురిడి వాన్కి సంతోషం చాతను తనలోతాను పాడుకున్న వాక్యం——

కొండవీడు మనదేరా,
కొండపల్లి మనదేరా,
కాదని యవ్వడు వాదుకువచ్చిన
కటకందనుకామనదేరా

అని తనలోను పదంగాను పాడుకొనెను. గనుకను ఆవాక్యం శకునం విచారించి యీదేశాలు సాధకానకు యిదేముహుర్తమని వాణువను పైనాకు అప్పాజీకి ఖబురు అంపించెను. అప్పాజీతో చెప్పమంన్న వాణ్ని యెటుమొకంగా వుండి చప్పవలెను అనివచ్చినవాణ్ని అప్పాజీ అడిగితేను తూర్పు ముఖంగ్గా నిలుచుండి చెప్పుమని చెప్పెను. గనుకను రాణువను తూర్పు దిక్కున యిలాదిగుమని భేరి వేయించి అదేముహుర్తంగా తల్లి౯ వచ్చి కొండవీడు వచ్చెను. కొండవీడు సాధకం ఆయెను. కొండవీడు కింద చెల్లేశేషులు సాధకం ఆయెను. ఈ కొండవీటికి దిగువకోట పెట్టించి నౌనులు నాదెండ్ల గవుని కొండపల్లి గవును అని నామంగనుకను చేశారు. వినికొండ బెల్లంకొండ, నాగార్జునకొండ దుర్గాలు సాధించి కొండపల్లి దగ్గరను వీడు విడిచి కొండపల్లి సాధకం అయిన తదనంతరమందునను గజపతివారి మీదికి దాడియెత్తి ఆరంట్ల కోనకొల్ల బుచ్చి గజపతివారి మీదను ముత్తక నేశనగకను ఆగజపతి తన కూతురునితన గండ్డ పెండేరము రాయల్కు యిచ్చెను. అక్కడ నుండి శింహాద్రి దగ్గటసు జయశిల నిల్పివచ్చి గజపతికూతురుని పెండ్లాడి తులాభారం తూగి బ్రాహ్మణులు యజమాని పెత్తనం అడిగిన వారికి యిచ్చెను. వృత్తి క్షేత్రాలు యిచ్చెను. రాజ్యం యేలుచూ వుండి ధర్మపరాయణులైన శ్రీకృష్ణ దేవరాయలు యిచ్చిన గ్రామాదులను రాయదత్తి అన్కుందురు. శ్రీ మంగళాద్రి స్వామివారినైవేద్య దీపారాధనలకు మంగళగిరి ౧ నంబూరు ౧ యీ రెండు గ్రామాదులను యిచ్చెను. యీమని శ్రీరాముల్కు రాము పాలెం యిచ్చెను తాళ్ల పాకల యిచ్చిన గ్రామములు కొండవీటి హవేలీలోను కోనేటి చింనన్నగారికి వినుకొండశీమలోను మిన్నకల్లు ౧ అద్దంకి శీమలోను కలెమర్ల ౧ యీ రెండు గ్రామాదులుయిచ్చెను. వీరు పొలిమేరలకు పోయి కంభాలు వేయించిరి. దిరుగు కోనేటి తిరువెంగళయ, గారికి యిచ్చెను. కాశిపాడు మధార అయివుండగాను కాళెపాడు యిచ్చెను. యీ కాళిపాడు వాన్కి ముందు యిచ్చెను. మధుర ఆయగనుకను యీతిరువెంగళయ్య గార్కి యిచ్చెను. గనుకను యీ తిరువెంగళయ్యగారు దిడుగ కువకంభాలు వేయించిరి వుత్తర గుండవరం గ్రామం కోనేటి తిరువెంగళయ్యగారికి యిచ్చెను. యీ యనకరకంభాలు వేయించెను. యీమని శిద్దిరాజు వెంకటాద్రి ఆనేటి అయ్యవార్ల గారికి యిచ్చెగనుకను యీ కృష్ణదేవరాయలు చోడవరం జవ్విపూడి యీరెండు మధుక అయిపుండె గనుకను యీమధురాలు రెండూ కల్పి యిచ్చె గనక యీకోనేటి అయ్యవార్లుగారు పొలిమేర కల్పికరకంభాలు