పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

53


బంధించు౹ గురు త్తైన వురుద్రాడు చటుల విక్రమ
కళాసాహసం బొనరించు కుటివారు
నకు జోడు ముగురు రాజులకును మోహంబు బుట్టించు
కొమరు మించిన యట్టి కొండవీడు
చజులమత్తేభ సామంత సరవిరభటన నెకహటి। ప్రకట
గంధ శింధరాభట మొహనారాల దనరు
కూర్మిన మదావతికి జూడు కొండూరు।।

అని శ్రీనాధుడు అనే గనుకను అప్పుడు శ్రీనాధుడు అని గుర్తు యెరుక తగిలి బహుమానం గాను కూర్చుండ నియమించెను. కొంన్ని దినములు జరిగిన తదనంతరమందునను కృష్ణదేవరాయలు గృహరాజు మేడ గట్టించవలెనని యత్నం విచారించేగనుకను రాయలవారు విచారించి శ్రీనాధుని మాటకు చూచిరంమ్మనమని తగువారిని పంపించే గనుక శ్రీనాధుడు యిక్కడను విచారించి తగువారిని కొండవీటికి ఫర్మాయించెను. తనమాట అభద్ధం అవుతుంన్నదని కోమటి వేమన్నకు వుత్తరం పంపించెను. యిక్కడ రాయలు దేవుండు గృహరాజు మేడ కట్టించవలెనని యత్నంగాను యిక్కడ కొండవీటిలోను వేమారెడ్డి కట్టించినాడు అని కట్టించెను. యిక్కడను భావించి తమవారిని తగువారిని చూచిరమ్మని పంపించినాడు. వాడు యిక్కడికి రాకముంన్నే యిక్కడమాట తప్పితంగాకుండా వారు వచ్చేటప్పటికి గృహరాజు మేడ కట్టించమని రెడ్డికి వుత్తరంవాశి పంపించెను. గనుకను రెడ్డి ఆవుత్తరం చూచుకొని శ్రీ నాధుడు ఆడిన మాట తప్పించెను. గృహరాజు మేడయెంత త్వరను యేరీతిని అయ్యీని విచారించి చింతిస్తు వుండగాను వారిదేవతవల్ల గురంమ్మవచ్చి రెడ్డిని నీవు చాలా చింతిస్తూన్నావు నీవు వూరిలోను పోతురాజు గుడి ద్వారంవద్దను తుంమ్మవున్నది. పోతురాజుకు నీపేరు బెట్టి పుత్తరం వాశి మనుష్యులను ఆంపిస్తేను పోతురాజు ఆతుంమ్మయిస్తున్నాడు ఆతుమ్మ తెప్పియి స్తంభం చేయించి శ్రీఘంగ్గాను కట్టించుమని స్వప్నలబ్దమాయెను గనుకను అప్పడి నీపులూరు పోతురాజు రెడ్డి తన పేరు బెట్టించ్చి మేము యిక్కడ గృహరాజు మేడ కట్టిస్తున్నాను స్తంభం బేడు మీద్వార మందునవున్న తుమ్మదయచేయించవలెనని పుత్తరం వాశి మనుష్యులను పంపించె గనుక ఆపోయినవారు ఆజాబు పోతురాజు ముందర చదివి ద్వారం ముందరం జాబు వుంచిరి గనుకను వారి చెవులకు కొంచి పొంమ్మంన్న ధ్వనివినపడెను గనుకను ఆతుంమ్మ నరికి తెప్పించి తొమ్మిది రోజులకు మేడ అయ్యేటట్టుగాను కట్టించెను. రాయలు వారి తగువారు వచ్చినంతలోను కోమటి వేమంనవార్ని చాలా బహుమానము చేసి పంపించిరి గనుకను వారు పోయిరాయలు వేమంన్నతోను కట్టించిరి అని విన్నవించిరి. అప్పుడు శ్రీనాథుణ్ని చాలా బహుమానంచేశి కృష్ణ దేవరాయలు శలవు యిప్పించి పంపించిరి. శ్రీనాథుడు రాయలు వారి చాతను బహుమానము అందుకొని వచ్చెను. యీరీతిన రాజ్యం నూరు యేండ్లు యేలి బ్రాహ్మణులకు ఆకరణం అటు వనంగ్గాను అగ్రహారాలు యిచ్చిరి. శాశ్వతముగాను గృహ రాజు మేడ గట్టించి బొల్లుయోరు వెంకటేశ్వర్లు గట్టు పడమట శృంగ్గాన్కి గృహరాజు మేడకు కనక తోరణం కట్టించి ధర్మపరాణులై నూరు యేండ్లు యేలిచనిరి. నూరు యేండ్లు యేలి చనిరి. రాజువేమన చివరనాలుగు యేండ్లు యేలి దుర్మార్గపు నడతలు నడిచెగనుకను సారం