పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

గ్రామ కైఫియత్తులు


అనేటివార్కి అనుముచ్చివారు అనేటివార్కి యిచ్చిరి. శ్రీ వెలనాటివారికి ౩౬ వేగినాటివారికి 3 ద్రావిళ్ల కు ౫ యీ గ్రామాదులు ౪౪ రెడ్లు అకారణంగాను అగ్రహారాలు యిచ్చిరి. కోమటి వేమంన్న గృహరాజు మేడకట్టించ్చినాడు. కనుక తోరణం కట్టించెను. యీయకమామీసునను శ్రీనాథుడు కవీశ్వరుడు సొలస పొలంలో పాలెము యీ దొంత్రి అల్లారెడ్డి కూతురు వేమాంబ అని కుమార్తె ఆ వేమాంబ కుమార్తె ఆయిలంమ్మ అందురు. యీ ఆయిలంమ్మ సంక్రాంతి పండుగ వస్తేను తనకు పండుగ ఖర్చు కావలెను అని అల్లారెడ్డిని ఆడిగె గనుకను వార్కి ఖర్చుకు యినాంగాను ఆరెండుపాలెములు పొలిమేర హద్దులు పెట్టించె గనుకను అయిలంమ్మ పేరిట అయిలవరం అనిరి. సంక్రాంతి పండుగకు యిచ్చెను. గనుకను సంక్రాంతిపాలెం అని నామము అయెను. అలాయిదా గ్రామాదులు ఆయను. యీ రెడ్లువారు కొండవీడు మీది దుర్గం కట్టించ్చి కావు ఆశం౬౦౦౦ కొంమ్ములు ౧౨౦౦౦ రెండుకొమ్ములు అయితెను కొత్తడం కొత్తడానికి వకలి ప్పనను కాపు ౬౦౦౦ కిందను కాపు ౬౦౦౦ యీ చొప్పున దుర్గంకాపు ౧౨౦౦ జరందుల పేర్లుకు నేటి అయ్యబురుజు ౧ ఆళ్ల వాజరజు బ్రంహ్మదేవర గుండ్లమల్లి గురంమ్మ బురుజు ౧ వీరంన్న బురుజు పోతరాజు బురుజు ౧ రాజుబురుజు ౧ వీరిని తిరుపతి అనె బురుజు ౧ పెదతిరుపతి అనే బురుజు ౧ మిర్యాల చట్ట ౧ ఝుట్టబురుజు ౧ చుక్కలకొండ నెమండ్లబండ ౧ పావలలు కుర్వీ ౧ యేడుగుండలు ౧ గులిజికాలువ ౧ గంజామహల్ ౧ పడమటి పెద్దగవిని ౧ తూర్పున కట్టెలవడి ౧ యీ చొప్పున బురుజులకు పేరు బురుజులు కొ త్తడాలు కాశెనాయకులు పరివాలాలు మొహతాదులపేర్లు వుదయరావు సౌజనరావు, గణపతిరావు. జంన్నపనాడు. కటినెండు సూరపనేడు, మాచినేడు తిరువెలమనాయకులు, బలిజనాయకులు వినోదరావు మహీపతీరావు, భూపతిరావు ముత్తలనెడు సోమరౌతు బుక్కా నాయకుడు అక్కానాయకుడు పండ్రిగి రామానాయకుడు తులవా వెంకటాద్రి నామనాయకుడు సూరానాయకుడు శ్రీగిరినాయకుడు సాబంతుకు యిక్కుర్తి తిమ్మనాయకుడు యడ్పలకొండ నాయకుడు చిరంరంగారావు అంబటి చంద్రా నాయకుడు ముత్యాల నాయకుడు ముంగరోతు వీరబలిజ నాయకులు తుర్కానాయకులు దాజిమ నాయకుడు హస్యమ నాయకుడు అబ్దల్లా నాయకుడు అల్లి నాయకుడు రాజానాయకుడు కరీంన్నాయకుడు దాముచినాయకుడు వీరుతురక నాయకులు. యీనాయకులు తమ యినాములువుంన్న ఆశంక్కాపు౧౨౦౦౦ యీచొప్పున దుర్మం కాపువినికొండ బెలంకొMడ నాగార్జునికొండ దుర్గాలు యీచొప్పున గాకాచిమల్లు మాటకాడై గజపతి నరపతులకు అలవిగా కను వుండే రెడ్డి కరాజ కలుసు వేరుపడి కొండవీటి శీతలు ౧౪ గిరిదుర్గాలు గురంమ్మవారికి దేవతానువరుసలెడి నిక్షేపం శ్రీనాధుడు కవీశ్వరుడు వీరికీర్తి ప్రఖ్యాతి చెయ్యండం నానాదేశాల యందు వెనగ ఆయను. గన్కు కృష్ణదేవరాయులుకు శ్రీ నాధుని క్కావనం రెడ్లవారు కవీశ్వరుడు అనీ వినికిడి. ఆయన గనుకను శ్రీనాధుంణి చూడవలెనని పిలిపించె గనుకను శ్రీనాధుడు విజయనగరం పోయిరాయలసంన్నిధాన మందునకు నిలచినంతలోను శ్రీనాధుడు పుట యెవర్కులేదు గనుకను నీద యేపూరు అని అడిగింగనుకను శ్రీనాధుడు రాయదేవునితో యిచ్చిన పద్యం॥

సీస పద్యం ॥ పరరాజు పరదుర్గ పరవైభవ వజ్రలకోస కొని నితనాడు
కొండవీడు పరిసంధి రాజన్య బలము