పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

51


యీ రెండు గ్రామాదుల్కు రామంన్న యిచ్చిన మిరాశీలు వెలనాడు సంప్రతి ౧ కాశ్యప గోత్రులు వీరిని గాదిరాజువారు అందురు. వీర్కి నంబూరులోను సంప్రతి యిప్పించి యీ రెండు గ్రామాదులుకుంన్నూ ....తుంమ్మపూడి శ్రీవత్స గోత్రులు జున్ను సానివారు అనేటివారికి ఏకసంప్రతిగాను యిచ్చిరి. శృంగారపాడు కౌండిల్య గోత్రులు వెలమూరి వారు అనేటివారికి ఏక సంప్రతి యిచ్చిరి. పెదవడ్లపూడి రామన్న యిచ్చిన మిరాశి వెలనాడు మంచిరాజువారు అందురు వీరికి మంగళగిరిలోను సంప్రతి యిప్పించ్చి యీ వడ్లపూడి హరితస గోత్రులు వేమూరివారు అనేటివారికి ఏకభోగంగాను యిప్పించిరి. కురగల్లు రామన్న యిచ్చిన మిరాశి ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని కేసంన్న వారు అందురు. వీరికి తాడికొండ లోను సంప్రతి యిప్పించి యీకురగల్లు హరితస గోత్రులు వీరిని యనమంద్ర వారు అందురు. కౌశిక గోత్రులు ఏక సంప్రతి ౧ ధరణికోట రామంన్న యిచ్చిన మిరాశి వెలనాడు సంప్రతులు ౨ కి మాదిరాజు వారు సాయింఖ్యాయింనస గోత్రులు సంప్రతి ౧ బొమ్మకంటివారు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ న్ని వీరికి తమ్మవరందిడుగు యీ రెండు గ్రామాదులలోను సంప్రతి భాగం యిప్పించి ధరణికోట బ్రాహ్మణులకు యిచ్చిరి. కొండూరి వారు అనేటివారు శాండిల్య గోత్రులుకు తీర్థాలవారు అనేటివారికి హరితస గోత్రులు వీరికి కప్పగంతువారు అందురు కౌశిక గోత్రులు వీరికి మూడు సంపతుల్కు యిచ్చిరి. వుత్తర గోరం రామన్న యిచ్చిన మిరాశి నందవరీకులు వీరికి సంపతులు ౨కి శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ న్ని వీరికి పెదకూరపాటిలో సంప్రతి యిప్పించ్చి మల్లాది వారు అనేటివారు హరితస గోత్రులు వీరికి, సంప్రతులు యిచ్చిరి. గరికిపాడు రామన్న యిచ్చిన మిరాశి వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు వీరికి పెదకూరపాటిలో సంప్రతి యిప్పించి యీ గరికెపాడు కాశ్యపగోత్రులు కొలిచిన వారు అనేటివారికి ఏక సంప్రతిగాను యిచ్చిరి. కొల్లి మర్ల రామన్న యిచ్చిన మిరాశి వెలనాడు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వీరిని శింగంపల్లి వారు అందురు. వీరికి పచ్చలతాడిపర్తిలో సంప్రతి యిప్పించి యీ కొల్లి మర్ల కౌండిన్య గోత్రులు వీరిని పెద్దిభొట్లవారు అందురు. వీరికి యిచ్చిరి. ఏక సంప్రతి గాను బండారుపల్లె రామంన్న యిచ్చిన మిరాశిలు ప్రథములు భారద్వాజ గోత్రులు వీరిని గోవాడవారు అందురు. వీర్కి తాడికొండలోను సంప్రతి యిప్పించి యీపండాపల్లె శ్రీవత్సగోత్రులు కంచిభొట్లవారు అందురు సంప్రతి యిచ్చిరి. ముల్లారు రామంన్న యిచ్చిన మిరాశీ వెలనాడు కౌండిన్య గోత్రులు ఆరాధ్యులవారు అందురు. వీరికి గొల్లి పరలోను సంప్రతి యిప్పించి యీ ముట్లూరు ప్రథములు కౌండిన్య గోత్రులు జొంన్నలగడ్డవారు నైషధంచారు పాలపర్తివార్కి మూడు సంప్రతులు యిచ్చిరి. కోడూరి రామన్న యిచ్చిన మిరాశి ప్రథములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరికి మండూరిలోను సంప్రతి యిప్పించ్చి యీకోడూరి భారద్వాజ గోత్రులు మాధవపెది వారు అనేటివార్కి యేకభోగంగా యిచ్చిరి. పెనుపులి రామంన్న యిచ్చిన మిరాశి వెలనాడు గౌతమగోత్రులు వీరిని తొలపూడివారు అందురు. వీరికి కొల్కలూరీలోను సంప్రతి యిప్పించ్చి యీపెనుపులి మూడుతెగలవారికి యిచ్చిరి. జంన్ని సానివారికి ౧ ఆకిళ్లవారు అనేటివార్కి జనమంచి వారు అనేటివార్కి యిచ్చిరి. సంప్రతులు 3 కి పెనుగుదురుపాడు రామంన్ని యిచ్చిన మిరాశి ప్రథములు కౌండిన్య గోత్రులు వీరికి సంప్రతి చుండూరులోను యిప్పించ్చి పెనుగుదురుపాడు రెండు తెగలవారికి యిచ్చిరి. హరితస గోత్రులయిన నాదెండ్లవారు