పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

గ్రామ కైఫియత్తులు


గోత్రులు యక్కటి పెనుమర్రు రామంన్న యిచ్చిన మిరాశీని వెలనాడు సంప్రతి ౧ ముద్గల గోత్రులు వీరు దేశాంతరులు అయిపోయినారు. గనుకను బ్రాహ్మణులకు యిచ్చిరి. పిల్లుట్ల వారు అనేటివారికి వుడుతావారు అనేటివారికి పిసపాటివారు అనేటివారికి యిచ్చిరి. పిల్లుట్లవారు శ్రీవత్స గోత్రులు పిశపాటివారు గౌతమ గోత్రులు పుడుతావారు యీమూడు తెగలవార్కి యిచ్చిరి. చివ్వలూరు రామంన్న యిచ్చిన మిరాశి ప్రథముల సంప్రతి ౧ వీరిని వుప్పలవారు అందురు. వీరికి కఠవరంలోను సంప్రతి యిప్పించి యీ చివ్వలూరు తూమునూరువారు అనేటి వారికి హరితస గోత్రులకు యేక సంప్రతి యిచ్చిరీ పెదపూడి ఆదిపూడి యీ రెండు గ్రామాదులున్ను రామంన్న యిచ్చిన మిరాశీలు తెలగాణ్యులు కౌశిక గోత్రుల సంప్రతి వీరిని పువ్వరాజువారు అందురు. వీర్కి గుంటూరులోను సంప్రతి యిప్పించి యీ గ్రామాదులు ౨ న్ను బ్రాంహ్మణులకు యిచ్చిరి. పెదపూడి శాండిల్య గోత్రులు యెల్లే పెద్దివారు అనేటివారికి ఏకభోగం యిచ్చిరి. పెదరావూరు మూడు తెగల వారికి యిచ్చిరి. జాగర్లమూడివారు శ్రీవత్స గోత్రులకు బొల్ల వారు అనేటి వార్కి గారుమంచ్చివారు అనేటి వార్కి యీ మూడు తెగలవారికి యిచ్చిరి... పినపాడు రామంన్న యిచ్చిన మిరాశి గౌతమ గోత్రులు వీరిని...... లక్కనవారు అందురు. వీరికి నూతక్కిలోను మిరాశీ సంప్రతియిప్పించి యీపిసపాడు తూమునూరు వారు హరితస గోత్రులు అయ్యగారివారు భారద్వాజ గోత్రులు ఆంగలకుదురు జఝువరుపు వారు అనేటి వార్కి యిచ్చిరి. ఏక భోగంగాను యిచ్చిరి. వలివేరు రామంన్న యిచ్చిన మిరాశి గౌతమ గోత్రులు వీరిని సమయం మంత్రి వారు అందురు. వీరికి చుండూరిలోను సంప్రతి యిప్పించి యీ వలివేరు హరితస గోత్రులు రూపాకులవారు అనేటివారికి యిచ్చిరి. ఏకభోగంగాను కోడితాడిపర్రు రామంన్న యిచ్చిన మిరాశీ వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని చంద్రమౌళివారు అందురు. వీరికి చుండూరిలో సంప్రతి యిప్పించి యీ కోడితాడిపర్రు జమ్ములమడకవారు అనేటివారికి కౌండిన్య గోత్రులకు యిచ్చిరి ఏకసంప్రతి దక్షిణ మర్రిపూడి రామన్న యిచ్చిన మిరాశి తెలగాణ్యులు శ్రీవత్సగోత్రులు వీరిని నాగరాజువారు అందురు. వీర్కి కొంమ్మురిలోను సంప్రతి యిప్పించి యీమర్రిపూడి శాండిల్య గోత్రులయిన కంభంపాటివారికి అనేటివారికి యిచ్చిరి. పెదచెర్కూరు రామంన్న యిచ్చిన మిరాశి తెలగాణ్యుల సంప్రతులు ౨కి భారద్వాజ గోత్రుల సంప్రతి గౌతమ గోత్రుల సంప్రతి ౧ న్ని యీ రెండు తెలగాణ్యుల వారికిన్ని మిరాశీలు భారద్వాజ గోత్రులకు కందుర్తిలోను సంప్రతి యిప్పించి వీరిని కొమ్మరాజువారు అందురు. గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరికి గుంటూరిలోను సంప్రతి యిప్పించెను. వీరిని బుద్దివారు అందురు. యీ పెదచెర్కూరు తెగల బ్రాహ్మణులకు యిచ్చెను. భాగస్థులు గుంటూరివారు అనేటివారికి గోరివారు అనేటివారికి అందుకూరివారు అనేటివారికి వంక్కవారు అనేటివారికి కందుర్తివారు అనేటివారికి పాలపర్తివారు అనేటివారికి వీరు యేడు తెగలవారికిన్ని యిచ్చిరి. తూర్పు గండిపాడు రామన్న యిచ్చిన మిరాశి ప్రథములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరు దేశాంతరులయిరి గనుకను యీ గంటిపాడు శ్రీవత్స గోత్రులు కొత్తపల్లి వారు అనేటివారికి యిచ్చిరి. ఏకసంప్రతి పెదకొండూరు రామంన్న యిచ్చిన మిరాశి వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని దొండపాటివారు అందురు. వీరిని కొల్లి పరలోను సంప్రతి యిచ్చి యీ కొండూరు రెండుతెగలవారికి యిచ్చిరి. మక్కపాటి వారు అనేటివారికి పుచ్చావారు అనేటివారికి గౌతమ గోత్రుల వారికి తుంమ్మపూడి శృంగారంపాడు