పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

49


యీగూడవల్లి ప్రతిగ్రహీతులు కౌండిన్య గోత్రులు. వీరిని యోద్భాంవారు అందురు. వీరికి యిచ్చిరి. నడిమిపల్లి పకాద్గల్య గోత్రులు వీరిని కొమాండూరివారు అందురు. వీర్కి యిచ్చిరి. గుండ్లపల్లి కౌశిక గోత్రులు వీరిని యోలివారు అందురు. వీరికి యిచ్చిరి. యీ అయిదు గ్రామా దులు ద్రావిళ్లకు యిచ్చిరి. శ్రీశ్రీ వెలనాటి బ్రాహ్మణులకు ౩౬ కి చినపులివర్రు గురిగింద పల్లె అద్దేపల్లి యీమూడు గ్రామాదులు రామంన్న యిచ్చిన మిరాశీలు తెలగాణ్యులు పరాశర గోత్రులు సంప్రతి ౧ వీరిని బండారువారు అందురు. వీరికి పెదపులిపర్తిలోను సంప్రతి యిప్పించ్చి మూడు గ్రామాదులు బ్రాహ్మణులకు యిచ్చిరి. చినపులివర్రు శ్రీవత్స, గోత్రులు వీరిని కూచిమంచివారందురు వీర్కి వెంపటివార్కి అనేటివార్కి యిచ్చిరి. సంప్రతులు ౨ కి యిచ్చిరి. గురిగిందపల్లి కందావారు అనేటివారికి యిచ్చిరి. యేక భోగంగా అద్దేపల్లి శ్రీవత్స గోత్రులు రై తావారు అనేటివార్కి యిచ్చిరి. యేక సంప్రతి పెనుమూడి నందవరీకులు ౨న్ను గ్రామాదులకు రామంన్న యిచ్చిన మిరాశీలు వెలనాడు సంప్రతి ౧ కౌశిక గోత్రులు వీరిని గంధంవారు అందురు. వీరికి ఆత్తోలు శిరిపురం యీ రెండు గ్రామాదులలోను సంప్రతి యిప్పించి యీ పెనుమూడి అనంతవరాలు భారద్వాజ గోత్రులు ప్రభలవారు అనేటి వార్కి యీ రెండు గ్రామాదులు యిచ్చెను. యేక సంప్రతి ౧ పెనుమర్రు పెదకొండిపర్రు యీరెండు గ్రామాదులకు రామంన్న యిచ్చిన మిరాశీ వెలనాడు ఆత్రేయ గోత్రులు వీర్ని ఆడిదెంచారు అందురు. వీరికి పెదపులివర్తిలోను సంప్రతి యిప్పించి యీ పెను కుర్రు భారద్వాజ గోత్రులయ్ని పనపాటివారు అనేటివారికి యేక సంప్రతి యిచ్చిరి. పెదకొండ పర్రు యీ భారద్వాజ గోత్రులయిన పిసపాటివారికింన్నీ వాధూలగోత్రులయిన సుమాళంవారీకింన్ని రెండు సంప్రతులుగా యిచ్చిరి. పెరవలి రామంన్న యిచ్చిన మిరాశీ వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని జడవారు అందురు. వీర్కి ఓలేటిలోను సంప్రతి యిప్పించి యీ పెరవలి తాడేపల్లి వారు హరితస గోత్రులున్నూ హేమాద్రి వారు అనేటివారికి యీ ముగ్గురుంనూ మూడు సంప్రతులు పెరవల్కి యిచ్చిరి. కొల్లూ రి రామన్న యిచ్చిన మిరాశీలు వెలనాడు పరాశర గోత్రులు వీరిని నాడెండ్లవారు అందురు. కొల్లూరు కాపులు ౨ న్ను యేక సంప్రతి గనుకను గుంటూరిలోను వీర్కి సంప్రతిగాను యిచ్చి యీ కొల్లూరు ఆరుతెగలవారికి యిచ్చెను. తూమునూరువారు అనేటివారికి ౧ కలగవారు అనేటివార్కి ౧ గ్రంధేశిరివారు అనేటివార్కి ౧ బుర్రావారు అనేటివార్కి ప్రభలవారు అనేటివార్కీ ౧ పీసపాటి వారు ఆనేటివార్కి ౧ యీ ఆరుతెగలవాండ్లకు ఆరు సంప్రతులు యిచ్చిరి. యీ తూమునూరివారు హరితస గోత్రులు జర్రావారు లోహిత గోత్రులు ప్ర.....కు (మాతృభిన్నం) వృత్తులు ౨౦౦ చిలుమూరు రామన్న యిచ్చిన మిరాశీలు వెలనాడు షడవర్ష గోత్ప్రులు వీరిని అన్నా ప్రెగడ వారు అందురు. వీర్కి యీ వూరిలోను సంప్రతి యిచ్చి యీచిలుమూరు శాండిల్య గోత్రులు హరివారు అనేటివార్కి యిచ్చిరి. ఏక సంప్రతిగ పిడపర్రు రామంన్న యిచ్చిన మిరాశి గౌతమ గోత్రులు వీరిని మండెంగవారు అందురు. వీరు లింగధారులు అయివుండి తమ బంధుసమేతంగాను అరవై యిండ్లవారు మను ఖండించుకొని జంగాలలో కలిసిపోయిరి గనుకను యీ పిడపర్రు మూడు తెలగా బ్రాహ్మణులకు యిచ్చిరి. కౌశిక గోత్రులయిన యెనమంద్ర వారు అనేటివారికి నైషథంవారు అనేటివార్కి చిలుకూరువారు అనేటివార్కి యీ మూడుతెగలవార్కి యిప్పించిరి. చిలుకూరివారు హరితస