పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

గ్రామ కైఫియత్తులు


వేమంన్న ౨౪ సంవ్వత్సరంబులు యేలెను. అటుతరువాతను రాజనవేదున ౪ సంవ్వత్సరంబులు యేలెను. యీరాజనవేమన యేలిన నాలుగు సంవత్సరంబుల దుర్మార్గ నడతల్కు పన్ను పుచ్చుకొనె గనుకను సారం యెల్లయ్య అనే బంట్రోతు భార్య ప్రసూత అయితెను పురిటి పంన్ను తెమ్మనిరీగన్కును ముత్యాలమ్మ గుడిదగ్గిరను రాజనవేమనను పొడిచి చంపెను. రెడ్లవారికుదురు సరి యీఆరుగురు నూరు మేండ్లు యేలిరి యీరెడ్లు యిచ్చిన ఆ... రపు గ్రామాదులు చెరువు విప్రధర్మమం వెంకటేశ్వర ప్రీతిగాను అలాయిదాగాను నియ్యోగులకు యిచ్చెను.

శ్లోకం॥ లబ్ధం పెరుహిభూం ఓశశిరవే శ్రీభోగలింగశ్య
సర్వంత త్తే సహ సూరనార్యా శుధియాధారాపియః
పూర్వకం ఆత్రేయ నవసుంధరైః ౹
క వేధునాస్యయ్యాప్య భాగాషకః చాతుంబి రూపుతి
నామక ......... ప్రఖ్యాత మేతద్భవె శ్రీయూచిరుపులి

వానోనేశ్వసూప్రతిగాను ఆవూరి నియ్యోగులకు యిచ్చిరి ... క్క శీమను యిచ్చెను. కాణిదెన రాచపూడి యీ రెండున్ను బ్రాహ్మణుల అగ్రహారాలకు అగ్రహారాలు యిచ్చిమున్కు అగ్రామాదులు రామంన్న నియ్యోగులకు యిచ్చినవి. రాచపూడి సంప్రతులు ౨కి కౌశిక గోత్రుల సంప్రతికి పడ్మటి రెట్లపాడు గోంగ్గులపాడు యీ రెండు గ్రామాదులలో యిప్పించెను. ఆత్రేయ గోత్రుల సంప్రతికి యీమనిలోను బల్లికురువ వారు యేకసంప్రతిలో పాతికె సంప్రతి యిచ్చెను. కొణిదెన సంప్రతి ౧ కి శౌండిన్య గోత్రులు వీరికి యీవని బల్లి కురువ వారి ముప్పాతికె భాగంలో పాతికె యిచ్చెను. రెడ్డిదత్తి ఆగ్రహారాలు వేంగ్గినాటివారికి మూడు గ్రామాదుల వారికి నుంన్ను యిచ్చిన వారికి క్రాపపరాశర గోత్రులయిన నాదెండ్ల వార్కి గుంటూరులోను మిరాశీలు యిప్పించి యీక్రాపవేంగ్గినాటి బ్రాహ్మణులును కాశ్యప గోత్రులు వీరిని గోడవర్తివారు అందురు. యేక భోగంవీరికి యిచ్చిరి. తూర్పు దండ్డమూడి రామంన్న యిచ్చినమిరాశీ- ప్రధములు కౌండిన్య గోత్రులు వీరిని సావడివారు అందురు. వీరికి గాజువోలు సంప్రతిలోను యిప్పించి యీదండమూడి వేగినాడు బ్రాహ్మణులు కాశ్యప గోత్రులు మండూరి వారు అనేటివార్కి యిచ్చిరి. దక్షిణ గుడిపూడి రామంన్న యిచ్చిన మిరాశి తెలగాణ్యులు కౌండిన్య గోత్రులు వీరిని సోమనవారు అందురు. వీరికి కొంమ్మూరిలోను మిరాశీ సంప్రతి యిప్పించి యీగుడిపూడి వేగినాడు బ్రాహ్మణులకు ఆత్రేయ గోత్రులు వీరిని మంత్రవాది వారందురు. వీరికి యిచ్చిరి. యీమూడు గ్రామాదులు వేగినాటివారికి యిచ్చినారు. శ్రీద్రావిళ్లకు యిచ్చిన గ్రామాదులు అయిదు. శ్రీలు పొంన్నపల్లి ఆరెపల్లి యీ రెండు గ్రామాదులకు రామంన్న యిచ్చిన మిరాశీలు ప్రధములు కౌండిన్య గోత్రులు వీరిని ఘట్టువారు అందురు. వీరు దేశాంతరులు అయినారు గనుకను ద్రావిడ బ్రాహ్మణులకు యిచ్చిరి. పొంన్నపల్లి ద్రావిళ్లు—— వీరిని కూతురాజువారు అందురు. భారద్వాజ గోత్రులు వీరికి యిచ్చిరి. యేక భోగంగాను ఆరెపల్లి ద్రావిళ్లు పరాశర గోత్రులు వీరిని తట్టువారు అందురు. వీరికి యేక భోగంగాను యిచ్చిరి. గూడపల్లి నడిమపల్లి యీ మూడు గ్రామాదుల్కు రామంన్న యిచ్చిన మిరాశి వెలనాడు లోహిత గోత్రుల సంప్రతి ౧ వీరిని కోలపాటివారు అందురు. వీరికి ఓలేటి లోను సంప్రతి యిప్పించి యీ గ్రామాదులు ౩ నిన్నీ ద్రావిళ్లకు యిప్పించిరి.