పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

47


గోత్రుల సఁప్రతి ౧ వీరిని చూచిరాజు వారు అందురు ఖండవీలు ౨౪ వొలివేరు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని సమయం మంత్రి వారు అందురు. కోరుతాడిపర్రు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని చంద్రమౌళివారు అందురు. ఖండవీలు ౪౦ పినపాడు నందవరీకుల సంప్రతి ౧ గౌతమగోత్రులు ఖండవీలు ౪ం పెదపాడు నందవరీకులు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ అమర్తులూరు సంప్రతులు 3 కి వెలనాడు సంప్రతులు ౨కి హరితస గోత్రుల సంప్రతి వీరిని పులపాకవారు అందురు. భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని సాయినివారు అందురు. కరణకంమ్మల సంప్రతి ౧ మౌద్గల్య గోత్రుల సంప్రతి ౧ వీరిని తింమ్మరాజువారు అందురు. ఖండవీలు ౨౪ం రెడ్లవారి యేలుబడి వీరియింటిపేరు దొం త్తివారు అందురు. వీరు పంట రెడ్లు శ్రీకృష్ణానది పుత్తరం ఆశ్వపతులు యేలుచూ వుందురు. యేలేశ్వరం హద్దుచేసి నరపతులు పడమట దక్షిణ రాజ్యంబు యేలుచూవుండి యీగజపతులు యేలేశ్వరం హద్దుచేశి తూర్పు రాజ్యం యేలుచూవుండి తదనంతరమందునను యీదొంతి అల్లా రెడ్డి అనుమ కొండలను కాపురం వుండే వేమిశెట్టి అనే వైశ్యుని పరుసవేది అపహరించిమల్లా గుర్తంమ్మ అని దేవతను బంగారం ప్రతిమెను. సంపాద్యంచేస్కుని అనుమకొండనుంచి కొండవీడు ప్రవేశం ఆయెకు. ఇతనివెంబడిగాను వేమశెట్టి హత్యవచ్చెగనుక ఆపరుసవేది కొల్లాగుంమ్మ దేవతతోను కొండవీటిలోనిలిచి కొండవీడు, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునికొండ, పల్లెలుదుర్గాలు కట్టించ్చి నరపతి యుపతులకు యదురులేక యేలుబడి నలుగురు కుమాళ్ళుతోను వీరు నూరు యేండ్లు యేలిరి: ధర్మాపరాయణులై అకరణ అలవణంగా బ్రాహ్మణులకు అగ్రహారాలు యిచ్చి గృహారాజు మేడ గట్టించి చోట్ల పెదారు వెంక్కటేశ్వర్లు గట్టి పడమటి శృంగానికి గృహరాజు యేడకుంన్ను కనకతోరణం కట్టించిరి. శ్రీనాధుడు యీరేపల్లె వార్కి కవీశ్వరుడు గనుకను యీరెడ్లవారికీర్తి ప్రశస్తి ఆయను. యీ రెడ్లవారు అనుమకొండ నుంచి కొండవీడు వచ్చిన సంవత్సరం॥ శ్రీశ్రీమచ్చెకాబ్దేష్టా చలాభ్రి......

శ్లోకం॥ రెండు సంఖ్యా ప్రవృత్తెసంధాత
నాబ్దె అల్లాడభూ పేసుముకుందదేశః
దొంతైన్వయః కుండిన మాజధామః
తస్యపార భలేంద్రస్య కుండిన క్షోణీవాసతః ।
...................ధ్యచతురః ౹
పుత్రః సత్యవర్ధపరాయణః ౹
తేషాంశ్రేష్ఠిత యోరాజా వేనుభూపాలసత్తమః ౹
బ్రాంహ్మణీభ్యశ్చతశ్వాత్మా రెంశగామాందదౌ శ్రీమాత్ ౹
త్రయోరేగికులినేభ్యోద్రావిడేభ్యశ్చపిపంచ్చ్యప ౹
వెలనాటి కులేభ్యశ్చ పట్త్రంక గ్రామసత్తమాః ॥

యీరెడ్ల అకరణం అలవణం గాను బ్రాహ్మణులకు అగ్రహారాలు యిచ్చిరి. పోలయ వేమంన్న ప్రధములు ౧౨ సంవ్వత్సరంబులు యేలెను. అటుతర్వాతను ఆంన్న వేమన్న ౩౦ సంవ్వత్సరంబులు యేలెను. అటుతరువాతను అనవేమారెడ్డి ౧౨ సంవ్వత్సరంబులు యేలెను. అటుతరువాతను కొమరగిరిరెడ్డి ౧౪ సంవ్వత్సరంబులు యేలెను. అటుతర్వాతను కోమటి