పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

39


పల్లి ప్రథములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౧౮ం మేంజెండ్ల ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬౦ దక్షిణ గుండవరం వెలనాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రులు వీరిని అన్నదాన భొట్లవారు అందురు. ఖండవీలు ౬౦ చెముళ్ళ మూడి వెలనాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రులు ఖండవీలు ౬౦ దక్షిణ నారా కోడూరు సంప్రతులు ౨కి పాకనాడు శ్రీవత్స గోత్రులు శివదేవుని వారందురు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని సాధువారు అందురు. ఖండవీలు (మాతృ భిన్నం) గోడవర్రు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪౦ నైనవరం వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ కొల్కలూరు వెలనాడు సంప్రతులు ౨ కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని గోపరాజువారు అందురు. పరాశర గోత్రుల సంప్రతి ౧ వీరిని మాదిరాజువారు అందురు. ఖండవీలు ౮౦౦ వెనుపులి వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని యెల్లంపూడి వారందురు. ఖండవీలు ౧౮౦ అనుమర్ల పూడి ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ఖండవీలు ౧౨౦ శేకూరు తెలగాణ్యులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪౦ శలపాడు తెలగాణ్యులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ తంగేళ్ళమూడి ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి జాగర్లమూడి ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౬౦ యడ్లపల్లి సంప్రతులు ౨కి శ్రీవత్స గోత్రులు ప్రధములు సంప్రతి ౧ వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు వీరిని తురకావారు అందురు. ఖండవీలు ౮౦ వడ్లమూడి సంప్రతులు ౨ కి ప్రధములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వెలనాడు ఆనంత్తవరం ప్రధములు ఖండవీలు ౧౬౦ చేబ్రోలు సంప్రతులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని తుకకావారు అందురు. ఖ ౧౬౦ కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరిని బేచిరాజువారందురు. హరితస గోత్రుల సంప్రతి ౧ కి వీరిని కొంమ్మరాజువారందురు. భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ కి వీరిని మల్లా ప్రెగడ వారందురు. చంన్నా ప్రెగడ వారి సంప్రతి ౧ ఖండవీలు ౬౦౦ కోవెల మూడి చంన్నా ప్రేగడవారు అందురు. ఖండవీలు ౧ళ౦ కోమిరిమూడి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని మల్లా ప్రెగడవారందురు. ఖండవీలు ౪ం నారికేళ పల్లెవెలనాడు హరితస గోత్రుల వారిని కొంమ్మ రాజువారు అందురు. సంప్రతి ౧ ఖండవీలు ౪౦. శ్రీరంగపురం కౌండిన్యస గోత్రుల సంప్రతి ౧ వీరిని దేచిరాజువారు అందురు. ఖండ వీలు ౪౦ యీశ్రీరంగపురం పూర్వం మూడు పూళ్ళపొలం కూర్చివూరు చేసినారు. వడ్లమూడి పొలంలో—ర్జంచెలియిపదింన్ని పెరుగుదురపాడు పురం ఖండవీలు ౧౬ న్ను చేబ్రోలు పొలంలో ఖండవీలు ౧౬ యీనలభై ఖండవీలు గ్రామంచేశిరి. పెనుగుదురుపాడు ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వలివేరు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని సమయ మంత్రి వారు అందురు. అంగలకుదురు నందవరీకులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ కోరుతాడిపర్రు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని చంద్రమౌళి వారందురు. ఖండవీలు మంచ్బాళ్ళ వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ వట్టి చెర్కురు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ లేమల్లె వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ దక్షిణ చింత్తపల్లె కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ క్కారెంపూడి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦