పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

35


వెంకటాదిరామానాయకుడు, సూరానాయకుడు, శ్రీగిరి నాయకుడు, బిసాబత్తుడు, యిక్కుర్తి తిమ్మానాయకుడు.. . కొండానాయకుడు బీరంరంగారావు, అంజేటి యర్రానాయకుడు, ముత్యాల నాయకుడు, మంగపోతు వీరు బలిజనాయకులు...నాయకుడు హసనునాయకుడు, అబ్జలు...నాయడు, అల్లినాయకుడు, రాజానాయకుడు, కరీంనాయకుడు, దావలచినాయకుడు, వీరు తారకనాయకులు. ఈ నాయకులు తయినాతులువున్న.....౧౨౦౦౦ యిచొప్పున దుర్గంకాపు వినికొండ, బిలంకొండ. నాగార్జునకొండ దుర్గాలు ఈచొప్పునగా... కాడై గజపతి...లకు అలవిగాకను ఉండేరెడ్డి కర్ణాటకులను వేరుపడి... కొండవీటి సీమలు ౧౪కి దుర్గాలు గురమ్మ వారికి దేవతా... వేదినిక్షేపంశ్రీనాధుడు కవీశ్వరుడు వారికీర్తి ప్రఖ్యాతి... నానాదేశాలయందు విన...ఆయెను. . .కృష్ణ దేవరాయలకు... శ్రీనాధుని కవనం రెడ్లవారు కవీశ్వరుడని... వినికిడి ఆయెగను శ్రీనాధుణ్ణి చూడవలెనని పిలుపించే గనుక శ్రీనాధుడు విజయనగరంపోయి రాయల సన్ని ధానమందునను నిలిచినంతలోను శ్రీనాధుడు... లేదు గనుకను నదియేవూరని అడిగె గనుకను శ్రీనాధుడు రాయల దేవునితో ఇచ్చిన పద్యం ॥

సీస పద్యం ॥ పరరాజు పరదుర్గ పరవైభవ ప్రజలకొసకొని విడనాడు
కొండవీడు పరిపంధి రాజస్య బలము
బంధించు। గురుతైన వురుద్రాడు భటుల విక్రమ
కళాసాహసం బొనరించు కుటివారునకు జోడు
ముగురు రాజులకును మోహంబు బుట్టించు కొమర
మించిన యట్టి కొండవీడు భటుల మత్తేభ
సామంత పరివీరభటన నెకహటి ప్రకట గంధ
శిందురార్భట మోహనాశ్రీల దనరు కూర్మినమరావతికి జోడు కొండవీడు౹౹

ఖండవీలు ౧౨౦ దక్షిణ అనంతవరం వెలనాడు భారద్వాజ గోత్రం సంప్రతి౧ వీరిని మొక్కపాటివారు అందురు. ఖండవీలు ౧౫౦ దక్షిణ వెలగపూడి వెలనాడు భారధ్వాజస గోత్రులు సంప్రతి ౧ఖండవీలు ౮ం మట్టికుంట ప్రధములు భారద్వాజస గోతుల సంప్రతి౧ వీరిని మిద్దెవారందురు. ఖండవీలు ౮౦ నాయిపల్లి అరవకుల సంప్రతి ౧ ఖండవీలు పెద్ద గంజాం వెలనాడు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు మేడివెర్ల... సంప్రతి ౧ ఖండవీలు ౧౦౦ యర్రవరం కొసరునాయలు మౌద్గల్యగోత్రుల సంప్రతి ౧ ఖండ వీలు ౧౦ పెదపల్కలూరు సంప్రతులు ౨ కి వెలనాడు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ ప్రథములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౩౦౦ చిన పల్కలూరు ప్రథములు సంప్రతి ౧ కౌండిన్యస గోత్రులు వీరిని పట్టస్వామి వారందురు. ఖండవీలు ౪౦ మల్లవరం వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ గోపీనాథపురం వెలనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ఖండవీలు ౪ం చినపణిదేరం సంప్రతులు ౨ కి వెలనాడు భారద్వాజగోత్రులు సంప్రతి ౧ ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరు పట్టస్వామివారందురు. ఖండవీలు ౬ం విస్తల ప్రథములు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు ఖండవీలు ౬౦ వెలపర్తి పాడు వెలనాడు కౌండిన్య గోత్రులు సంప్రతి ఖండవీలు ౪౦ దక్షిణ పొట్టపాడు వెలనాడు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ మేడుకొండూరు వెలనాడు సంప్రతులు 3 కి పరాశర గోత్రులు సంప్రతి ౧ వీరిని అక్కిరాజువారు అందురు. శౌనక గోత్రులు