పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

గ్రామ కైఫియత్తులు


వీలు౪౦౦దక్షిణ కనుపర్రు వేలనాడు గౌతమ గోతమ గోత్రులవారు సంప్రతి౧ వీరిని కొడవలివారు అందురు. ఖండవీలు ౪౦౦ ఏనుగువారు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతికి౧వీరినే వెలగపూడివారందురు. ఖండవీలు ౨౦౦దక్షిణ ఆనంత్తవరం వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి౧ వీరిని వెల్కపూడివారు అందురు. ఖండవీలు ౧౫౦దక్షిణం వెలగపూడివారు భారద్వాజస గోత్రుల సంప్రతి౧ఖండవీలు౮౦ మట్టి కుంబ ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి౧ఖండవీలు౬ం మోటుపల్లి తెలగాణ్యులు భారద్వాజ గోత్రులు సంప్రతి౧ వీరిని బంద్దేవారు అందురు. ఖండవీలు ౮౦నాయిపల్లిలో సంప్రతి౧ఖండవీలు౬౪ పెదగంజాం వెలనాడు భారద్వాజస గోత్రుల సంప్రతి౧ఖండ వీలు౬ం పెరేచెర్ల పెసరవాయులు మౌద్గల్య గోత్రులు సంప్రతి౧ఖండవీలు౧౬౦యర్రవరం పెసర వాయులు మౌద్గల్య గోత్రుల సంప్రతి౧ఖండ వీలు౭ం పెదపల్కలూరు సంప్రతులు౨కి వెలనాడు... ధంవారు పాలపర్తివారికి మూడు సంప్రతులు యిచ్చిరి. కాడూ—— రామన్న యిచ్చిన మిరాశి ప్రధములు కౌండిన్య గోత్రులు సంప్రతి౧వీరికి మండుగులోను సంప్రతి యిప్పించ్చిరి. ఈకోడూరు భారద్వాజ గోత్రులు మాధవపెద్దివారు అనేటివారికి ఏకభోగం యిచ్చిరి. పెనుపులి రామన్న ఇచ్చిన మిరాశి వెలనాడు గౌతమ గోత్రులు వీరిని యెల్యంపూడి వారందురు. వీరికి కొల్కలూరితోను సంప్రతి యిప్పించి యీపెనుపులివారి సంప్రతి గలవారికి యిచ్చిరి. జన్న సానివారికి ౧ ఆకెళ్ళ వారు అనేటి వారికి జనమంచివారు అనే వారికి యిచ్చిరి. సంప్రతులు3కి పెనుగుదురుపాడు. —— యిచ్చిన మిరాశి ప్రధములు కౌండిన్య గోత్రులు వీరికి సంప్రతి చుండూరీలోను యిప్పించి పెనుగుదురుపాడు రెండు—— వారికి యిచ్చిరి. హరితస గోత్రులయిన నాదేండ్లవారు అనేటి వారికి అగుమంచివారు అనేటివారికి యిచ్చిరి. శ్రీవెలనాటివారికి ౩౬ వేగినాటివారికి 3 ద్రావిళ్ళకు ౫ ఈ గ్రామాదులు ౪౪ రెడ్లు ఆకరణంగాను అగ్రహారాలు యిచ్చిరి. కోమటివేమన్న గృహరాజమేడ కట్టించినాడు. కనకతోరణం కట్టించెను. ఈయన కమామిసునను శ్రీనాథుడు కవీశ్వరుడు సొలస పొలంలో పాలెము యీదోంతిఅల్లా రెడ్డి - వేమాంబ అని కుమార్తె అయిలమ్మ అందురు. ఈ అయిలమ్మ సంక్రాంతి పండుగవస్తేను తనకు ......పండగ ఖర్చు కావలెనని అల్లారెడ్డిని అడిగె గనుకను మనుమరాలికి ఖర్చు యినాంగాను ఆరెండు పాలెములు పొలిమేర గోడలు పెట్టించే గనుకను ఆయిలమ్మవేట అయిలమ్మ——అనిరి. సంక్రాంతి పండుగకు యిచ్చెను గనుక సంక్రాంతిపాళెం అని నామము ఆయెను. అలాయిదా గ్రామాదులు ఆయెను. ఈ రెడ్లవారు కొండవీడు మీద దుర్గం కట్టించిరి కాపు అంశం ౬౦౦౦ బ్రాహ్మలు ౨౦౦ రెండు కొమ్మలు అయితేను కొత్తడంకొత్తడానికి వక ...కిందను కాపు 200 చొప్పున...కాపు౧౨౦౦౦. పులిచెర్ల కొనేటి అయ్యబురుజు ౧ ఆళ్ళవాబురుజు బ్రహ్మ దేవర గుండమల్ల గండమ్మ బురుజు... స్నబురుజు పోతరాజు బురుజు౧... రాజుబురుజు.. తిప్పనిబురుజు... తిరుపతి అనే బురుజు౧ మిర్వా...ఝుట్టిబురుజు౧ చుక్కలకొండ౧ నెమళ్ళకొండ ౧ పాముల కుర్వ౧ ఎడుకొండలు౧ గంజి కాలువ౧ సబ్జా...పడమటి పెదగుని౧ తూర్పున కట్టెలనది౧. ఈ చెప్పున బురుజులకు పేర్లు. ఈ బురుజులకు కొత్తడాలు కాళేనాయకులు... మెహతాదుల పేర్లు ఉదయరావు పాజనరావు గణపతిపరావు మరిన్ని... కటినేండు సూరపనేడు యెలనేడు. ౩౦౦ వెలమ నాయకులు బలిజనాయకులు వినోదరావు, పరిపాపతిరావు, భూపతిరావు, ముండల నేడు సోమరౌతుజక్కా నాయకుడు, అంకానాయకుడు, పంద్రంగిరామానాయకుడు, తులువా