పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

29


పిచ్చపాటిని అందురు, ఖండలికి కుంటలు ౫ం యాభయి ఖండలికి కుంటలు ౪ం చేశి ఖండల కుచ్చలు ౮౦ కుంటలు, మారం కుంటల కుచ్చలకు ౫ం. యీచొప్పున ఖండవీలు రెండు అయితేను యీ కొచ్చెళ్ళలకు యక్కవపాటిన్ని తక్కువపాటిన్ని అందురు. యీ రెడ్లవారి యేలుబడిని తూంప్ప కుచ్చెళ్ళు అనిరి. యీ కుచ్చెళ్ళకు కుచ్చెలకు రెండు తూంపలున్నర అయితేను కుచ్చల అనిరి. యీ వెనుకను కృష్ణదేవరాయలు యేలుబడిని తూంపులు అని అందురు. నాలుగు బారల ఘడను నూరు కుంటలు అయితేను బిగువు అందురు. యివి ఖండవీలు అనంగ్గాను కుచ్చళ్ళ సంజ్ఞ ఖండ్రవాటు అనంగ్గాను ఖ ౧ అనుట ఖండ్డెమనంగ్గాను బేతెడు అనుట ఖండించు మనంగ్గాను తెగగొట్టమనుట యివి పూర్వపు మాటలు. యీ రామన్న కొండవీటి కిందను చెల్లెశీములు ౧౪ కి దేశం పెత్తనం యిచ్చిన మిరాశీలు నియ్యోగులకు అద్దంకిన, అమ్మనబోలు శీమలు ౨ కిజుమలా సంప్రతులు నాలుగింటికి సంప్రతులు వెలనాడు వేగినాడు సంప్రతులు నీలంరాజు వారనేటివార్కి సంప్రతి ౧ పొలంరాజువారు అనేటి వారికి సంప్రతి ౧ రామరాజువారు అనేటివారికి సంప్రతి ౧ అద్దంకివారు అని గ్రామనామం సంప్రతి ౧ యీ నాలుగు సంప్రతులు అద్దంకి అమ్మనబోలుకు జమలాగా యిచ్చెను. కందుకూరి శీమకు కరణకంమ్మలు సంప్రతులు ౨ కి అక్కిరాజువారు అనేటివార్కి సంప్రతి ౧ మంత్తరాజువారు అనేటివారికి సంప్రతి ౧ కందుకూరి శీమకు యీ రెండు సంప్రతులు యిచ్చెను. నెల్లూరి శీమకు సంప్రతులు 3 కి కరకంమ్మలు సంప్రతులు ౨ కి, అక్కంరాజువారి సంప్రతి ౧ ముత్తరాజు వారి సంప్రతి ౧ తెలుగాణ్యుల శ్రీవత్సగోత్రులయ్ని, ఆదిరాజువారు అనేటివార్కి సంప్రతి ౧ యీ నెల్లూరికి యీమూడు సంప్రతులు యిచ్చెను. ఉదయగిరి చుండి శీమలకు యీ రెంటికి సంప్రతులు ౨ కి కరణకమ్మల సంప్రతులు ౨ కి అక్కిరాజువారి సంప్రతి ౧ ముత్తరాజు వారి సంప్రతి ౧ రెండు శీమలు వీరికి యిచ్చెను. పొదిలెశీమకు వెలనాటి సంప్రతి ౧ కి పొలంరాజువారు అందురు వీరికి యిచ్చెను. మారెళ్ళశీమకు వెలనాడు సంప్రతులు ౨కి దూళిపాళ వారికి సంప్రతులు బచ్చలివారు అనేటివారికి సంప్రతి ౧ యీ శీమలకు రెండు సంప్రతులు యిచ్చెను. కోటసీనుకు వెలనాడు సంప్రతులు ౨ కి తురిమెళ్ల వారు అనేటివారికి సంప్రతి కాశిరాజు ఆనేటివారికి సంప్రతి ణ యీ సీనుకు రెండు సంప్రీతులు యిచ్చెను. దూపాటిశీమకు వెలనాడు సంప్రతులు ౨ కుంబాలవారు అనేటివార్కి సంప్రతి వీరు కరణ కంమ్ములు అన్నంరాజు వారు అనేటివార్కి సంప్రతి ౧ యీ రెండు సంప్రతులు యిచ్చెను. నాగార్జునికొండ శీమకు ౫ కి సంప్రతులు ౪ కి మాచర్ల సంతు సంప్రతులు ౨ కి వెలనాడు సంప్రతి ౧ కి వీరిని కందకూరివారందరు ప్రథములు. సూరపరాజు అనేటివార్కి సంప్రతి ౧ యీ సంతుకు రెండు సంప్రతులు యిచ్చెను. కారెంపూడిసంతుకు ములుగోటి సంతు యీ రెండు సంతులకు సంప్రతి ౧ యీ కందుకూరివారికి యిచ్చెను. గురిజాల సంతుకు వెలనాడు సంప్రతి ౧ దుగ్గరాజు అనేటివారికి యిచ్చెను. తంగ్గేడు సంత్తు వెలనాటి సంప్రతి ౧ వీరికి తుమ్మలచర్వు వారందురు హరితస గోత్రులు వీరికి యిచ్చెను. ఈ సంతులు ౫ం న్నూ నాగార్జునకొండ శీమ అందురు. యీ సంప్రతులు నాలుగు యిచ్చెనూ. బెల్లంకొండసీమకు సంప్రతులు 3 కి ప్రథములు బెహరావారు అనేటివారు సంప్రతి ౧ కి కరణి కంమ్మలు గ్రామనామం సంప్రతి ౧ వెలనాడు సంప్రతి ౧ శ్రీ గోపరాజువా వారు అనేటి వారికి యిచ్చెను. యీ బలకొండ