పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

గ్రామ కైఫియత్తులు

అర్కసంఖ్యాక గోత్రాణం విస్త్రాణాచ మహాత్మనాం,
అంబరం గతికంర్ణించ ఖండ్డవి గణపతిర్దదౌ,
బాలభాస్కరదేవే శహస్వశౌక పుస్యచ నభరచ
గుణాక్షానిఖండ్డ వినాంధ్వీభాగగా౯ వియోజ్యకృత్యాముత్పాలనాంన్మాతి
తృండ్రపాటి కాందదౌద్వాదశో గోత్రేభ్య విఖ్యేప్రే ధర్మచింత్తయా ॥

యీ చినకూరపాటి ఖండవీలు 3౬ం యీపొలంలో పాలెంఖండవీలు ౨౪ం పంన్నెండు గోత్రాలు బ్రాహ్మణులకు వృత్తిక్షేత్రాలు యిచ్చి యీ కూరపాటి ఖండవీలు ౧౨౦ వుంచి పొలిమేరలకు హద్దులు పెట్టించెను. అలాయిదా గ్రామం ఆయను ముప్పాలపూడి నామం ఆయను. యీ కూరపాటి పొలంలో ఖండ్రపాటి ముప్పాలపూడి యీమని పొలంలో ఖండ్రివాటు దుగ్గిరేలపూడి యీఖండ్రవాటలు రెండున్ను బాలభాస్కరదేవు యిచ్చెను. పాలడుగు ౧ విశ్వంబరుడు యిచ్చెను. (మాతృకభిన్నము.) శ్రీ శ్రీ గోపరాజు రామంన్న యిచ్చిన గణిక స్థావరాలు. యీ గణపతిదేవు యేలుబడిని యాజ్ఞమల్కి గోపరాజు రామంన్న అని ప్రధాని గణక స్థావరంబులు యిచ్చెను.

శ్రీశ్లోకాలు౹౹ గోత్రాశాస్త్రాబ్ర శీతాంశు సంఖ్యాబ్దే శాలివాహనే ౹
గ్రామస్థావర వృత్తిశ్చాకృతివా౯ గణికాగ్రణీః ॥
శ్రీమాంగణపతిర్చూపో గజపత్యన్వా యోద్భవః ॥
ఆస్తిభూమండలేతస్థ్యా బహుళశృంత్రి మంత్రిణః ౹
తేషాం శ్రేష్ఠతమోమాత్యః యాజ్ఞవమ్యోత్త మోద్విజః
గోపరాజాంన్వయోత్ఫంన్నో రామాభ్యోగణకాగ్రణీః
రక్తాక్ష్యబ్దెమాశి భాద్రపద బహుళ పక్షే
వర శ్రేర్క గ్రహంగే పుంణ్యకాలోంగారకవా సరే౹
గణకానాం హితార్ధయ సధ్యసః స్థాపనాయాచతిష్ట త:
శ్చశిమాన్మా౯ండయావత్తా వతువృద్ధియేతన
రాజాజాగ్ర హిందాపాం కృష్ణవేణీ తదేతదా |
గ్రామ స్థావరహృత్తేనాం సాక్షిణస్సర్వదేవతాః ॥

స్వస్తిశ్రీమత్రిభువనచక్ర వర్తి శ్రీమద్రాజరాజ విజయరాజ్య సంవత్సరంబులు శ్రాహి ౧౦౬౭ ఆగు నేటి రక్తాక్షినామ సంవత్సర భాధ్రపద బహుళ ౩౦ అంగారకవారంబున సూర్యో పరాగపుణ్యకాలమందునను గణపతిదేవుచాతను ధారాదత్తముబట్టి కరిణిక స్థావరంబులు యిగోపరాజురామంన్న నియోగ్యులకు గ్రామాదులు యిచ్చెను. యీ రామంన్న యిచ్చేవర్కు కరణీకం వ్రాశేవారు అర్వలు యీ కొండవీటి హవేలీ గ్రామాదులకు రామన్న యిచ్చే వర్కు కుచ్చళ్ల పే కత్తులు అందురు. కత్తి అనంగాను నాలుగు బారలకడను ౬౪౦౦ కుంటలు అయితే కత్తి అందురు. ౩౨౦౦ కుంటలు అయితే అరకత్తి అందురు. నాలుగు బారల ఘడకు ౪౦౦ కుంటలు ఆయితేను కొందరు పూర్వరాజుల యేలుబడిని ౧౬ మర్తువు అందురు. గజపతి యేలుబడిని ౧౬ ఘడను నూరు కుంటలు ఆయిన కుచ్చళ్లు యెనభై కుంటలది కుచ్చల. యీ కుచ్చళ్ల పేరు ఖండవీలు అనిరి. ఖండవీలు అనంగాను ఆరకుచ్చల పేరు. ఖండవీలు రెండు అయితేను నూరు కుంటలకు సౌంజ్ఞ ఖండవీలు, అయితే యెనభయి కుంటల కుచ్చల అసౌజ్ఞ అందురు.