పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

27


రుద్రవరం ౧, (యిక్కడ మాతృకభిన్నం,) నంద్ది వెలుగు ౧, కఠేవరం ౧, యీమని ౧ యీమని పాలంలోను యీగణపతిదేవు తమ్ముడు బాలభాస్కర దేవు ఖండు వీలు౧౫౦పోకౌల్కు లూరి పొలంలోను యీమని చింతలపూడి కొల్కలూరు కూడలి నుంచి యీమన్కి పడమర, కొల్కలూరికి తూర్పు యీశాన్యపు మూలకుని కుంట హద్దునుంచి దుగ్గిరాలపూడికి దక్షిణభాగం కొల్కలూరికి వుత్తరభాగం తుంగభద్ర, పడమర గోలాలమెట్టను, కొల్కలూరు, యీమని, పెనుమూరు కూడలికునికుంట, హద్దు కొల్కలూరి పోయి వుత్తరభాగం. ఖండవీలు ౧౦ ఖండ్ర వాటిలోనుకల్పి ఖండ్డవీలు ౧౬ం చేశిదుగ్గిరాల పూడి కొల్కలూర్కి పొలిమేర హద్దులు చేశినారు. వృత్తిక్షేత్రాలు ఖండ్రవాటు యిచ్చెను. చినకూరపాటి పొలంలోను ఖండ్రవీలు ౨౪౦ పొలిమేర హద్దులు బట్టి బ్రాంహ్మణులకు వృత్తిక్షేత్రాలు ఖండ్రివాలు గ్రామాదులు రెండు బాలభాస్కరదేవు యిచ్చెను. శ్లోకాలు.

యీమని పొలంలో పాలెందుగ్గిరాలపూడి ఖండ్రి వాలు

శ్లోకాలు: శ్రీమత్మకాబ్దేరసబాణఖేందుః సంఖ్యాప్రవృత్తే ద్విజపుంగవేభ్యః
చందాత్మజం శ్రీమతుదుగ్గిరేవాపుండి ధరోపరధోరి పరాగతాభ్యాం ౹
భతృతేృవంశాశ్నవ పూర్ణచంద్రా సభాల మార్తాండ మహితవేశాయత్కల్పయ
గ్రామమదంధరిత్రీం మదేత్రమాచంద్రదివే శతారాం ౹౹

శేషః ౹ త్తక్షర పద్మనాభకుశికానం తాబ్దికర్కొకటః ౹
వామక్యాది మహాపద్యనాగరి చదరం పండాత్మజానం దన్నభీమం
పాండువభీమ విక్రమనిభం శ్రీఖండవాటేశ్వరం క్రూరారాతి మెషెంద్రవజ్రత్తు
చితందక్షంతు భూపోత్తమం॥

స్వస్తిశ్రీ దంత్రి భువన చక్రవర్తి శ్రీమద్రాజరాజదేవర విజయరాజ్య సంవత్సరంబులు శా॥ ౧౦౫౬ (1134 A. D.) ఆగు నేటి ప్రమాదీచనామ సంవత్సరమందునను యీ బాలభాస్కరదేవు యీమనిపొలంలో ఖండ్రపాటి దుగ్గిరాలపూడి అలాయిదా గ్రామం చేశి పొలిమేర హద్దులు చేశి పంన్నెండు గోత్రాలవారికి వృత్తులు ౧౨ ఖండ్రవాటి గ్రామం యిచ్చెను. యీమన్కి పడమర దుగ్గిరేలకు తూర్పుపొలిమేరకు బాలభాస్కరదేవు కర వేయించినాడు. యీమని ౩౬౦ వృత్తులు గణపతిదేవు బ్రాంహ్మణులకు యిచ్చెను.

అర్కసంఖ్యార్క గోత్రాణాం,
విస్త్రాణాంచ మహాత్మనాం,
షష్టిత్రిదశ సంఖ్యా కామర్వీంగణపతిర్దదౌ,
శ్రీమా౯ శాకాబ్దే రసబాణఖెందు సంఖ్యాప్రవృత్తే ద్విజపుంగవేభ్యః ౹
గ్రామా౯దదౌ శ్రీగణపత్యభిక్యావృత్తి ప్రయుక్తా౯ గణపత్యధీశః ౹

పతిదేవు యిచ్చిన వృతిక్షేత్ర గ్రామాదులు ౪౨ ఖండ్రవాటేలు ౨ న్నూ చినకూరపాటి పొలం ముత్యాలకి ఖండృవాటు చేశెను. యీ బాలభాస్కర దేవు యీ కూరపాటి ఖండ్రవీలు ౩౬ం కి ఖండృవీలు ౨౪౦.

శ్రీదశబాణాdra భూసంఖ్యే ప్రవృత్తే
శకవత్సరే ప్రమోది సంఖ్య వర్షేతు
గణపత్యా న్వయాద్భవః ౹